కనుకధారాస్త్రోత్రం;- కొప్పరపు తాయారు
🌟శ్రీ శంకరాచార్య విరచిత🌟 

నుద్యాద్ దయాను పవనో  ద్రవిణాంబు ధారామ్
అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే !
దుష్కర్మ ఘర్మ  మపనీయ చిరాయు దూరం 
నారాయణ ప్రణయినీ నయనాంబు వాహ !!

భావం: లక్ష్మీదేవి యొక్క నీలమేఘములవంటి నల్లని కన్నులు,  ఈ దరిద్రుడనెడి విచారగ్రస్త పక్షి పిల్లపై దయ అనెడి చల్లని గాలితో కూడుకొని వీచి, ఈ దారిద్యమునకు కారణమైన పూర్వజన్మల పాపకర్మలను  దూరముగా తొలగద్రోసి, నామీద ధనమనెడి సోనలను ధారాళముగా కురియించుగాక !
విశేషార్థము: రెండవ పాదము నందలి ,'అకించన'శబ్దమునకు 'దరిద్రు' డనియు, 'పాపములు లేని'వాడనియు రెండర్థములు. 

                    *****


కామెంట్‌లు