ఊయల ఊగే పాపాయి ;- ఎడ్ల లక్ష్మి
ఊయల ఊగే పాపాయి 
కోయిల పాటలు వింటూ
రై రై మని నీవు లేస్తావా 
కోకిలమ్మ ను చూస్తావా 

కొమ్మల మీదికి వెల్తావా
కమ్మని పాట నేర్చుకొని 
తీయని గానం చేస్తూ
అందరినీ మురిపిస్తావా 

చిటారి కొమ్మల కెళ్తావా 
చిలక పలుకులం వింటూ
కిలకిల నీవు నవ్వుతూ
పిల్లలతో పలికిస్తావా 

కమ్మని పాటలు పాడుతూ 
తీపి పలుకులు పలుకుతూ
ఆటలు ఎన్నో ఆడుతూ 
హాయిగా నీవు ఉంటావా 


కామెంట్‌లు