వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచన పల్లి.
 మన పెద్దలు నువ్వులకు ఇచ్చిన ప్రాధాన్యత మరి  దేనికి ఇవ్వలేదు నువ్వులు వట్టివే తిన్న వారు ఉన్నారు  ఆ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంటిలోనూ  నువ్వుల నూనె ఉండేది  ప్రతి రైతు నువ్వులను పండించేవారు  ఆ నవ్వులను గానుగాడించి ఇంట్లో ప్రతిపదార్థంలోనూ  చివరకు దినపదార్థాల్లో కూడా  నువ్వుల నూనె వాడడం  అలవాటు  అయితే ఈ నూనె వాడడం వల్ల కొంచెం మనిషికి వేడి చేస్తుంది అని అంటారు కానీ అది నమ్మదగిన విషయం మాత్రం కాదు  ఈ రోజున వయసుతో సంబంధం లేకుండా అనేకమందికి దాదాపు నూటికి నలభై ఐదు మంది  షుగర్ జబ్బుతో బాధపడుతూ ఉంటారు  దానినే డయాబెటిస్ అని కూడా అంటారు  ఇది రావడానికి అనేక కారణాలు ఉన్నాయి  శరీరం తన ఆధీనంలో లేకపోతే మొదట వచ్చేది మధుమేహ వ్యాధి  దానిని తగ్గించుకోవడం ఎలాగో చూడాలి.రోజు పరగడుపున  నువ్వులు తినడం వల్ల  చక్కెర వ్యాధిని దూరం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది  ఈ నూనె వాడటం వల్ల శరీరానికి కావలసిన ప్రోటీన్లు సక్రమంగా అందుతాయి  కొంతమంది  ఎముకలు బలహీనంగా ఉంటాయి వారు తప్పకుండా నువ్వులు తినడం నువ్వుల నూనె వాడడం చేయాలి  దీనివల్ల రక్త సరఫరా మెరుగుపడుతుంది  ఎప్పుడు మెరుగుపడిందో  అప్పుడు రక్త పోటుతో వచ్చే బాధలు ఉండవు  హై బీపీని తగ్గిస్తుంది  శరీరంలో ఉన్న చెడు కొవ్వును కరిగిస్తుంది  దానివల్ల ఎలాంటి   బాధలు రావు గుండె జబ్బులను అరికట్టడానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది  రోగ నిరోధక శక్తిని పెంచి షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచడానికి ఈ నూనె ఎంతో ఉపయోగపడే  పదార్థం  క్రమం తప్పకుండా ఆయుర్వేదం చెప్పిన లెక్క ప్రకారం 40 రోజులు  వాడి చూడండి ఆ తర్వాత దాని గుణం ఏంటో మీ శరీరమే చెప్తుంది.ఇవాళ చదువు పెరిగింది ప్రతి ఇంట్లో  దానితో పాత తరం వారికి కొత్తతరం వారు పాఠాలు చెప్పడం మొదలు పెట్టారు  మా మనవరాలు ఎంబీఏ  చదువుతోంది  ఒకరోజు మాటల సందర్భాల్లో  ధనాన్ని ఎలా వాడాలి ఎందుకు వాడాలి  అన్న విషయాన్ని గురించి  చర్చ ప్రారంభమైనప్పుడు  మా శైలుషి అంటే అది పార్వతి దేవి పేరు  మా మనవరాలు కి పెట్టాం నీవు రూపాయిని  జాగర్తగా వాడితే  వందలు వేలు వాటి అంతట అవే పెరుగుతాయి  అని  నిజానికి ఆ ఆలోచన  నాకు రాలేదు ఏదో అవసరం ఉంది  ప్రతిదీ వాడడం తప్ప  దాని విలువ తెలియదు  అలాగే డబ్బులు పొదుపు చేసే దానికంటే కూడా ముందు అదుపు చేయవలసినది మాట  మాటకు మాట తెగులు నీటికి నాచు తెగులు అని ఒక సామెత తెలుగులో  డబ్బు పోతే సంపాదించవచ్చు మాట జారితే  అది జీవితాంతం వారి మనసులో నాటుకొని ఉంటుంది అన్నది జ్ఞాపకం పెట్టుకో అంటుంది మా బంగారు తల్లి
==============================
సమన్వయం ; డా . నీలం స్వాతి 

కామెంట్‌లు