సెనెగల్ కు చెందిన సాడియో మానే
ప్రపంచ ప్రసిద్ధి చెందిన 32 ఏళ్ల
ఫుట్‌బాల్ క్రీడాకారుడు సాడియో మానే.
Sadio Mane. అతని ఆదాయం భారత కరెన్సీలో వారానికి 14 కోట్ల రూపాయలని అంచనా.
ఇంత సంపాదిస్తున్నప్పటికీ అతని దగ్గరున్న మొబైల్ ఫోన్ అతి మామూలుది. పైగా
పగిలిన డిస్‌ప్లే తో గల ఫోన్. ఎందుకలాటి ఫోన్ తో కన్పిస్తుంటారేమిటి అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా అతనిచ్చిన జవాబు....
“నేను దానిని సరి చేస్తాను....
డిస్ ప్లే మారుస్తాను” అని.
అలా ఎందుకు...మీ సంపాదన తక్కువేమీ కాదు కదా. .. కోట్లల్లోనే కదా....ఆ సంపాదనలో ఓ కొత్త మొబైల్ ఫోన్ కొనుక్కోవచ్చు కదండీ....అని ఇంటర్వ్యూ చేసే అతను అడిగాడు.
దానికి స్పందిస్తూ సాడియో మానె అన్నాడు...
"నేను నా సంపాదనతో 1000 మొబైల్స్,
10 నౌకలు, 2 జెట్ విమానాలు, లెక్కలేనన్ని డైమండ్ వాచీలు ఇలా ఎన్నో కొనుక్కోవచ్చు. అయితే వీటన్నింటినీ
నేనెందుకు కొనాలి?
జీవితంలో పేదరికాన్ని చూశాను... తినడానికి కష్టపడ్డాను... చదవడం కూడా రాదు.. పేదరికం నన్ను చుట్టుముట్టి నులిమేసిన రోజులున్నాయి. చెప్పులు వేసుకునే స్తోమతలేని వాడిని. బూట్లు లేకుండా ఆడిన మ్యాచులున్నాయి....సరైన
బట్టలు లేకుండా తిరిగిన రోజులున్నాయి. ఆకలి బాధేంటో తెలిసిన వాడిని.
అయితే... అటువంటి నేను ఈరోజు ఇంతలా డబ్బు గడిస్తున్నాను. ప్రజలు చదువుకునేలా నా డబ్బులతో పాఠశాలలు ఏర్పాటు చేశాను. నా దేశంలో పేద పిల్లలకు కొత్త బూట్లు, బట్టలు ఇచ్చాను. ఎందరికో ఆహార కొరత తీర్చాను.
నేనిప్పుడు కోరుకున్నట్టు సౌకర్యవంతంగా
విలాసవంతంగా జీవించగలను. కానీ నాకది ఇష్టం లేదు..నా జీవితాన్ని నా దేశ ప్రజలతో పంచుకోవడంలో పొందే ఆనందాన్ని మాటల్లో చెప్పలేను..." అని.
ఇతను మానవత్వం ఉన్న మనిషి కదూ.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి