కృష్ణుడే నీ అన్నా;- ..జాధవ్ పుండలిక్ రావు పాటిల్సెల్ నెంబర్ 9441333315

 కృష్ణాష్టమి సందర్భంగా
=================
పూర్వం ఒక ఊరిలో తల్లి కుమారుడు. నివసించేవారు. భర్త మరణించడంతో వీరికి తోడు నీడ ఎవరూ లేరు. తల్లి ఎలాగో కష్టపడి జీవితం సాగిస్తుంది. తన కుమారుడైన జటిలూడిని బుద్ధిమంతునిగా, శక్తివంతునిగా పెంచడానికి సహకరించమని ప్రతిరోజు కృష్ణుని ప్రార్థించేది.
జటిలేవునికి కొంత వయసు రాగానే బడిలో చేర్పించింది. ఆ కాలంలో వీరున్న ఊరిలో బడి లేదు.  వారున్న ఊరి నుంచి చాలా దూరంగ ఉన్న ఊరిలో ఉండేది. రెండు ఊర్లకు మధ్య ఒక దట్టమైన అడవి ఉండేది. ఈ అడవి దాటి వెళ్లడానికి జటిలుడు భయపడేవాడు. నాకు తోడుగా ఎవరైనా ఉంటే బాగుండేది అని భావించేవాడు. తోడు ఎవరు లేకపోవడంతో తన శక్తినంత ఉపయోగించి పోయేటప్పుడు వచ్చేటప్పుడు పరిగెత్తుకుంటూ అడవి దాటేవాడు. బడికి వెళ్లేటప్పుడు వెలుతురు ఉండేది. వచ్చేటప్పుడు చీకటి పడేది. భయం ఎక్కువగా కలిగేది. ఇంటికి రాగానే అమ్మను చూసి ఏడ్చేవాడు. తల్లి ఓదార్చేది. అయినా జటలుని భయం పట్టిపీడించేది. తల్లి ఆలోచించి భయపడకు నాయనా నీకు ఒక పెద్దన్నయ్య ఉన్నాడు. ఆయన అడవిలోనే ఉంటాడు. అతని పేరు కృష్ణుడు. అతడు నీకు రాంగా పొంగా అడవిని దాటిస్తాడని చెప్పింది. అతడు అడవిలో ఆవులను మేపుకుంటూ ఉంటాడు. పోయేటప్పుడు వచ్చేటప్పుడు నీవు అతనిని గొంతు ఎత్తి పిలిచినట్లయితే నీ దగ్గరికి వస్తాడు. నీకు అడవి దాటిస్తాడు. భయపడకు అని చెప్పింది. జట్టిల్లుడు మరుసటి రోజు బడికి వెళ్ళటానికి బయలుదేరాడు. అడవికి చేరగానే అన్నయ్య కృష్ణ ఎక్కడున్నావు నాకు భయం వేస్తున్నది రమ్మని బిగ్గరగా కేక వేశాడు. వెంటనే కృష్ణుడు జట్టిల్లుని దగ్గరికి వచ్చి, ఎందుకు భయపడుతున్నావు నేనున్నాను నీకు ప్రతిరోజు అడవి దాటిస్తాను అన్నాడు. ప్రతిరోజు కృష్ణుడు జెట్టి లునికి రెండు పూటలు అడవిని దాటిస్తున్నాడు.
అన్నయ్య రేపు మా పాఠశాల విద్యార్థులందరూ వనభోజనానికి వెళ్తున్నాము. మా గురువుగారు ప్రతి ఒక్కరూ అందరికీ సరిపోయేలా ఏదైనా తినే వస్తువును తీసుకొని రావాలని చెప్పారు. కానీ మనం పేదవాళ్లం. అమ్మ దగ్గర అందరికీ సరిపోయే తినుబండారం ఏదీ లేదు. ఇలా అని చెప్పాడు. సరే తమ్ముడు మన దగ్గర ఆవులు ఉన్నాయి. పెరుగు బాగా ఉంది. రేపు బడికి పోయేటప్పుడు ఇస్తాను తీసుకొని వెళ్ళమని కృష్ణుడు చెప్పాడు. మరుసటి రోజు కృష్ణుడు ఒక చిన్న కడవలో పెరుగు ఇచ్చాడు. జటిల్లుడు పెరుగు తీసుకుని ఉపాధ్యాయుని వద్దకు వెళ్లాడు. ఇంత చిన్న కడవలో ఉన్న పెరుగు అందరికీ ఎలా సరిపోతుందని కోపగించాడు. సరే కొంతమందికైనా వేద్దామని ఉంచాడు జట్టిల్లుడు. అలా పెరుగు వేస్తున్నాడు. వేసిన వెంటనే పెరుగు మళ్లీ కడువలో నిండుతూ ఉంది. అందరికీ వేశాడు. అడిగినవారికి మళ్లీ మళ్లీ వేశాడు. ఉపాధ్యాయునికి ఆశ్చర్యం కలిగింది. నీకు ఈ పాత్రలో నీ పెరుగు ఎవరిచ్చారని ఉపాధ్యాయుడు జటిలునికి అడిగాడు. మా అన్నయ్య ఇచ్చాడని చెప్పాడు. ఏది నీ అన్నయ్యని చూద్దామని అడవికి వచ్చారు. జటిలుడు అడవికి రాగానే అన్నయ్య అని పిలిచాడు. కానీ కృష్ణుడు రాలేదు. ఉపాధ్యాయుడు అబద్ధం చెప్తావా అని జటిలున్ని కోపగించాడు. అంతలోనే ఆకాశవాణి వినిపించింది. మాస్టారు మీరు నన్ను చూడటానికి ఇంకా చాలా కాలం పడుతుంది. జటిలుని తల్లి నన్ను భక్తితో ప్రార్థించింది. నాపైన విశ్వాసముంచి కొడుకును నన్ను పిలువమని చెప్పింది. అందుకే నేను జటిలునికి తోడుగా నిలిచాను. మాస్టారుకు అంతా అర్థమయింది. అన్నయ్య ఎవరో కాదు సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడేనని భావించాడు.
నీతి. దేవుని పైన అపారమైన నమ్మకం, భక్తి ఉంటే అంతా మేలు జరుగుతుంది.

కామెంట్‌లు