కోపమే వ్యాఘ్రము;- -గద్వాల సోమన్న,9966414580
ప్రమాదమే కోపము
శత్రువు ప్రతిరూపము
అనారోగ్య కారకము
విడిచిపెట్టు శీఘ్రము

కోపతాపాలతో
చెడిపోవు బంధాలు
సున్నితమైన మనసులు
అవుతాయోయ్! ముక్కలు

కోపగుణము వ్యాఘ్రము
లేదు అందు క్షేమము
అణచుకో తక్షణము
దొరుకును ఆరోగ్యము

కోపంతో నష్టాలు
తెచ్చిపెట్టు కష్టాలు
మనశ్శాంతి దూరము
గుండె యగును భారము

నియంత్రణే మంచిది
లేకుంటే నాశము
శాంతగుణము గొప్పది
జీవితాన నాకము


కామెంట్‌లు