నగ్న సత్యాలు;- -గద్వాల సోమన్న,9966414580
ఉదయించే సూర్యుని
ఉద్యమించే యోధున్ని
ఎవరూ ఆపలేరు
గర్జించే సింహాన్ని

వాదించే మూర్ఖున్ని
కఠినమైన హృదయాన్ని
ఎవరూ మార్చలేరు
ఊసరవెల్లి నైజాన్ని

మితిమీరిన భారాన్ని
క్షమించరాని నేరాన్ని
ఎవరూ ఓపలేరు
నమ్మక ద్రోహాన్ని

కదిలిపోవు కాలాన్ని
అమ్మ లేని గృహాన్ని
ఎవరూ పూడ్చలేరు
నాన్న లేని స్థానాన్ని




కామెంట్‌లు