పశ్చాత్తాపం;- ఉండ్రాళ్ళ రాజేశం --స-ద్దిపేట -9966946084-
   ఇరువకొండ అడవిలో జంతువులు ఎంతో సంతోషంగా జీవిస్తున్నాయి. కుందేలు, తోడేలు, నక్క, జింక ఇలా అన్ని రకాల జంతువులు పండ్లు, దుంపలను ఎవరికివారే ఆహారాన్ని సేకరించుకుని తినసాగాయి. చిన్న, పెద్దని తేడా లేకుండా జంతువులు కలిసిమెలిసి జీవించేవి. అడవిలో సింహాలు, పులులు లేకపోవడం మూలంగా హింస లేని అడవిలో స్వేచ్ఛగా విహరిస్తూ అడవిలో తిరగసాగేవి.
            ఒకరోజు ఒక నక్కకు దురాశ పుట్టింది. చిట్టి పొట్టి జంతువులను తినాలని కోరిక పుట్టింది. పక్క అడవిలోకి వెళ్లి కొన్ని బొక్కలు తెచ్చి, పెద్ద గుండ్రాయి పక్కన వేసి అడవిలోకి పక్కా అడవిలోని సింహం వచ్చింది. చిన్న చిన్న జంతువులను చంపుతుంది. ఇదిగో చూడండి అంటూ బొక్కలు చూపించింది.  జంతువులన్నీ భయపడ్డాయి. 
              ఇలా అందరూ భయపడితే ఎలా! నేను సింహంతో మాట్లాడాను. రోజు ఒక జంతువును ఆహారంగా పంపమన్నది. ఈరోజు ఆహారంగా ఒక జంతువు కాళ్లు విరిచేసి పెద్ద గుండ్రాయి పక్కన వేయండి అని నక్క అంది. జంతువులని చాలా భయపడ్డాయి. చేసేది లేక ఈరోజు ఒక జంతువును ఆహారంగా వేయాలని నిర్ణయించుకున్నాయి. ఈరోజు ఆహారంగా నక్కనే వేసేద్దాం అంటూ కపటనక్క రెండు కాళ్లు విరిసి పెద్ద గుండ్రాయి పక్కన వేశారు. నక్క లబోదిబో అంటూ ఆరవసాగింది. మంటూ సింహంలేదు... ఏమీ లేదు... అంటూ నక్క నిజం చెప్పింది. కపట నక్క పన్నాగం మేము ఎప్పుడో పసిగట్టామని నవ్వుతూ జంతువులన్ని కూడా నక్కకు తగిన శాస్తి చేశామని తమ నివాసాలకు వెళ్లాయి. విరిగిన కాళ్లతో నిలువలేక పశ్చాత్తాపంతో నక్క జంతువులు పెట్టే పండ్లు, దుంపలు తిని జీవించసాగింది.


కామెంట్‌లు