శీవానందలహరి;- కొప్పరపు తాయారు

 శ్లో :గభీరే కాసారే విశతి విజనే ఘోరవిపినే 
విశాలే శైలేచ భ్రమతి కుసుమార్థం జడమతిః
సమర్ప్యైకం చేతస్సరసిజ ముమానాథ భవతే  
సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో !

భావం :
       ఓ పార్వతీ ప్రతీ ! మందబుద్ధి  కలవాడు .నీపూజలకుపువ్వులు కొరకు లోతైన చెరువులలో
దిగుతాడు,దట్నమయిన  అడవులలో తిరుగుతాడు.విశాలమైన కొండలయందు ,గుట్టలు యందు తిరుగు తాడు . అతను తనలో ఉన్న తన మనసు అను పద్మమును ,నీకు ,సమర్పించి,
ఈ లోకం లో సుఖంగా ఎందుకు ఉండుట లేదో
నాకు ఆశ్చర్యముగా ఉంది. మనస్సు పెట్టిన భక్తి
తో ఫుజించడము ముఖ్యము కదా !!
కామెంట్‌లు