న్యాయాలు-608
ప్రమదా సుఖ దుఃఖ న్యాయము
******
ప్రమదా అనగా సుందరి, స్త్రీ .సుఖ అనగా సుఖము.దుఃఖ అనగా బాధ అని అర్థము.
ప్రమదా సుఖ దుఃఖ న్యాయము అంటే సుఖమైనా,కష్టమైనా స్త్రీ వల్లనే కలుగుతుంది అని అర్థము.
అనగా సుఖ దుఃఖాలనేవి స్ర్తీ వలన కలుగుతాయనడానికి ముందు స్త్రీని కష్టపెట్టకుండా చూసుకునే ఏ ఇల్లయినా స్త్రీలకు నందన వనము అవుతుందని గ్రహించాలి.
సుమతీ శతక కర్త అంటారు "కలకంటి కంట కన్నీరొలికే చోట కలిమి నిలవదు" అని.ఆ పద్యాన్ని చూద్దామా...
'కులకాంత తోడ నెప్పుడు/ గలహింపకు వట్టి తప్పు ఘటియింపకుమీ/ కలకంఠి కంట కన్నీ/రొలికిన సిరి యింట నుండ నొల్లదు సుమతీ!"
కులకాంత అంటే ఇల్లాలు. ఆమెతో ఎప్పుడూ తగదా పడకూడదు. అనవసరమైన లేనిపోని నేరాలు మోపకూడదు. అలాంటి ఉత్తమమైన స్త్రీలని భాదించకూడదు. అలా బాధ పెట్టే ఇళ్ళల్లో సుఖం ఎప్పటికీ ఉండదు.
అలా బాధ పెట్టే దుర్మార్గపు వ్యక్తి అలా స్త్రీని హింసించి,ఏడిపించి తాను ఎంతో సంతోషంగా ఉన్నానని అనుకుంటాడొచ్చు కానీ అతడు చేసీన తప్పులను అంతరాత్మ ఎప్పుడూ ఎత్తి చూపుతూనే వుంటుంది.
అందుకే "ఇంటికి దీపం ఇల్లాలు" అంటారు. అంటే దీపాన్ని ఆరిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటే ఇల్లంతా వెలుగు వ్యాపిస్తుంది. ఆ వెలుగులో ఆనందంగా గడపొచ్చు.
ఈ న్యాయములో మరో కోణం కూడా ఉంది. కొందరు స్త్రీలు తమ గయ్యాళి తనంతో తాము సుఖంగా ఉండరు.ఇంట్లో వారినీ సుఖంగా ఉండనీయరు. మరి అలాంటి వారి వల్ల నిత్యం బాధే కలుగుతుంది.
మరికొందరు స్త్రీలు తమ ఓర్పు,సహనంతో కుటుంబం ఎప్పుడూ ఆనందంగా ఉండేలా, ఏదైనా ఇబ్బంది కరమైన విషయం అయినా అది దూది పింజలా తేలిపోయే విధంగా చూస్తారు అలాంటి వారి వల్ల భర్త, పిల్లలు ఎంతో సుఖంగా, ఆనందంగా ఉండ గలుగుతారు.
ఇదే "ప్రమదా సుఖ దుఃఖ న్యాయము"లో దాగి ఉన్న అంతరార్థం.ఒక కుటుంబమే కాదు.ఎక్కడ స్త్రీ గౌరవింపబడుతుందో ప్రేమింపబడుతుందో అక్కడ దేవతలు నివసిస్తారు అంటారు.
కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాల లోని అంతరార్థము. అది తెలిసి మసలుదాం. దైవంగా కొలుస్తూ స్త్రీలను గౌరవించడంతో పాటు వారి హక్కులను కాపాడడం కూడా మన విధి,ధర్మం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి