సెప్టెంబర్ 5 ,జ్ఞాన పాలవెల్లి,డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం.దేశమంతా ఉపాధ్యాయ దినోత్సవంశుభాకాంక్షలు అందిస్తూ,--------------------------------------------------------------------------------నేను!అజ్ఞానాంధకార భాస్కరుడ్ని!నిరక్షరాస్యత నిర్మూలన,సంగ్రామ యోధుడ్ని!ఊపిరి ఉలిగా,మలచుకున్న శిల్పిని!బోధనలో ,నిత్యము సాధకుడ్ని!చదువు మార్గాన అలసట,ఎరుగని ప్రయాణికుడ్ని!సమాజ వికాసానికి ,చేయూత నందిస్తున్న వాడిని!తరగతి గది, వాణి మది,నా నివాసము!విద్యార్థులతో కలసిమెలసి, జీవించడం మధుమాసము!నా శిష్యుల విజయాలు,నెమరు వేసుకుంటా !ఆ స్మృతులలో ,హాయిగా బతుకుతూ ఉంటా!నేను పోయినా ,నా విద్యార్థుల్లో బతికి ఉంటా!దేవుడు మరల జన్మనిస్తే, ఉపాధ్యాయుడ్నే అవుతా!_________
జ్ఞాన పాలవెల్లి,;-డాపివిఎల్ సుబ్బారావు,-ప్రధానోపాధ్యాయుడు.- (విశ్రాంత)విజయనగరం, 94410 58797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి