ఎస్పీబాలసుబ్రమణ్యంవర్ధంతి,
(సందర్భంగా)
========================
1.
దివి నుంచి దిగివచ్చి,
నిలిచిన గానపారిజాతము!
ఆ గానం నాదశరీర ,
గళశంకరాభరణము!
మధుర స్వరాల ప్రఖ్యాత ,
గంధర్వ గాయకుడు!
దక్షిణ ఉత్తర భారతాల
జన విఖ్యాతుడు!
సినీ సంగీత నేపధ్య గానాన
, చిరస్మరణీయుడు!
2.,
జన హృదయాల గూడా ?
మేడే కట్టినవాడు!
నలుబది వేల సినీగీతాలు,
గానం చేసిన వాడు!
సంగీత దర్శకత్వం,
వహించిన కడు సమర్ధుడు!
వెండితెరపై నటనతో సైతం,
మురిపించిన ఘనుడు!
గాన శ్రీపతి పండిత పామర,
జన ఆరాధ్యుడు!
3.
మర్యాద రామన్న శుభారంభం, కోదండపాణి కోరి ప్రోత్సాహం!
నటుల హావ భావాలకు,
అనుగుణమైన గానం!
డబ్బింగ్ ఆర్టిస్టుగా,
ప్రముఖనటులకు గాత్రదానం!
ఇరువది ఐదు ,
నంది పురస్కారాల వైభవం!
పద్మశ్రీ, పద్మభూషణ్ ,
పద్మ విభూషణ్, త్రి సత్కారం!
4.
పాడుతా తీయగా,
గాయక జీవన మహాప్రస్థానం!
దేశ విదేశాలలో,
అది ఎంతో గౌరవ స్థానం!
వర్ధమాన గాయనీ గాయకుల,
పరిచయ అవకాశం!
అనితర సాధ్యం ఈ సేవ, సంగీతసరస్వతి చరణాంకితం!
కోవిడ్ సోకి దేహం మృతం, గాన కోవిద గానం అమృతం!
బాల సుబ్రహ్మణ్యం,
ఆబాలగోపాలం చేసినపుణ్యం!
_________
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి