గృహ కార్మికులు ఐక్యత వర్ధిల్లాలి;- అంకాల సోమయ్య- దేవరుప్పుల-జనగాం-9640748497
 మేము ఇండ్లలో పనిచేసేటో ల్లం
మాకు సొంతం అంటూ ఏ పని లేదు
నాలుగిండ్లలో పని చేస్తేనే
మా ఇల్లు గడిచేది
మా ఇంటి ఆయన వాచ్మెన్
నేను ఇళ్లలో పని మనిషిని
ఒకటి నిలువుకాల్లా ఉద్యోగం
ఇంకొకటి ఒప్పుకున్న ఇండ్లలో
అంట్లు తోమి వంట చేయాలి
ఇల్లు వాకిలూడ్చి ఇంటి యజమానురాలు వంటిపని 
అన్ని టైంకి అయిపోవాలా
నాకు పిల్లలు ఉంటారు బాబాయా
ఇంటికి వెళ్లి
వాళ్లను తయారుచేసి బడికి పంపాలా 
అధిక సంతు ఉన్నటువంటి మాలాంటి కుటుంబాల్లో పదేళ్లు నిండిన బిడ్డలు పని మనుషులుగా మారక తప్పదు
మీరు బాల కార్మికులు అంటారు 
స్థిరమైన ఆదాయం లేని మాకు స్థిరాస్తులు లేని మాకు ఇంటిల్లిపాది చేస్తే తప్ప ఇల్లు గడవదు 
(నెలకు మూడు సెలవు ఇవ్వాలా)
గృహ కార్మికుల సంఘాలు గ్రామాలు పట్టణాల్లో ఏర్పాటు చేసి
వారికి ఉచిత వైద్యం అకారణంగా మరణిస్తే5లక్షల
నష్టపరిహారం 
ప్రభుత్వాలు చెల్లించాలి 
భారత కార్మిక మంత్రిత్వ శాఖ ద్వారా అన్ని రకాల సదుపాయాల అందాలా
 మేంపని చేసే కుటుంబ యజమానులు వారి ఉద్యోగాలు చేస్తే సంవత్సరానికి రెండు డిఎలుతీసుకున్నట్టు మాకు కూడా ప్రోత్సాహకాలు ఇయ్యాలా
ప్రతి  నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగులకు
వేతనం పెంపు ప్రభుత్వం చేసినట్టు 
మాకు కూడా 
మా యజమానులు పెంచాలా
మా ఇళ్లలో పెళ్లిళ్లు పేరంటాలు అయినప్పుడు
మేము చిన్న ఇల్లు నిర్మించుకున్నప్పుడు
యజమానులు ఆర్థిక సహాయం చేయాలా
ఇంటి పని కార్మికుల పై యజమానులు అకారణంగా దొంగతనం మోపితే నిజ నిర్ధారణ చేసి
పని వాళ్ళ ఇంట్లో నుంచి  వెల్లగొట్టడాన్నిగుర్తించి
అటువంటి యజమానుల్ని ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం చెప్పాలా
పనివాళ్లకైనా ఆత్మగౌరవం ఉంటుందని వారి ఆత్మ గౌరవానికి 
భంగం వాటిల్లితే
సరైన గుణపాఠం తప్పదని
సిరిసంపదలతో తులతూగే ధనిక
స్వాములకు తెలియాలా
గృహ
పని కార్మికులకు  కనీస వేతన చట్టాన్ని అమలు పరచాలి
స్థితిమంతులఇళ్లలో
ఊడిగం చేసే పని కార్మికులు
ఆఇంటి యజమానులకు
ఎంతో నమ్మకస్తులు కావున
వారు రిటైర్మెంట్ అయినప్పుడు
అన్ని రకాల బెనిఫిట్స్ వారికి యజమానులు అందజేయాలి వారికి కచ్చితంగా
నెల నెల పెన్షన్ ఇచ్చేలా చూడాలి
గృహ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి2
(అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం సందర్భంగా వ్రాయబడిన కవిత)
 

కామెంట్‌లు