విశ్వవిఖ్యాత నవరసనటనా
సార్వభౌముడు
తెలుగు వారి ఆరాధ్య దైవం గా
వెలుగొందిన నాటి మేటి నటుడు
దర్శకుడు నిర్మాత
రాజకీయ నాయకుడు
ఏ పాత్రలోనైనా అవలీలగా పరకాయప్రవేశం చేసి నటించి మెప్పించిగలిగిన
మనం కొలిచే శ్రీ రాముడు
శ్రీ కృష్ణుడు
రావణుడు
దుర్యోధనుడు
కర్ణుడు
పాత్రేదైనా ఎంతో గొప్పగా అభినయించిన మహానటుడు
క్రమశిక్షణ కార్యసిద్ధికి
నిర్వాహణ దక్షతకుపెట్టింది
పేరుగా నిలిచిన
మన నందమూరి తారక రామారావు గారు
అది జానపదమైనా
సాంఘీకమైనా
పౌరాణికమైనా
అందలి కథానాయికుడు
ఎవరైనా
ఏ వేషమైనా
దానికి తగ్గట్టుగా
ఎటువంటి హావభావాలైన పలికించడంలో దిట్ట ఎన్టీ రామారావు
తరువాతే వేరెవరైనా
అట్టడువర్గాలు పేదలు
నిరుపేద ప్రజల దైన్యాన్నికళ్ళారచూసి చలించి
తానే ఈ వ్యవస్థను గాడిలో పెట్టేందుకైతెలుగువారి ఆత్మగౌరవాన్నిచాటే
తెలుగుదేశం పార్టీని నెలకొల్పిఎన్నకల్లో పోటి చేసి గెలిచి
పదకొండు నెలల కాలవ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రై సుపరిపాలనందించిన
ప్రజానాయకుడు
మన ఎన్టీ రామారావు గారు
అలాంటి మహనీయుడు
మన తెలుగువాడుగా జన్మించడం
మన పూర్వజన్మ సుకృతం
తాను మన తెలుగు భాషాప్రేమికుడు
నిండైన తెలుగుదనం
వేషభాషల్లో చాటిన ఒకే ఒక్కడు ఆంధ్రులు తమ ఆత్మీయతనుచాటే అన్నగారు
ఎన్టీఆర్
తెలుగు జాతి భూమ్మీద ఉన్నంతవరకు గుర్తుండే ఒకే ఒక్కడు మా(మన )నందమూరి తారక రామారావు గారు
ఇలాంటి మహానాయకుడు నభూతో నభవిష్యతి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి