చంద్రయ్యకు ఒక్కగానొక్క కొడుకు విజయ్. విజయ్ ని అల్లారు ముద్దుగా పెంచేవారు. విజయ్ ఏది అడిగినా చంద్రయ్య కాదనకుండా కొనిచ్చేవాడు. విజయ్ పెద్దవాడు అయ్యాడు. కానీ విజయ్ మాత్రం అల్లరి పనులు మానడం లేదు. ఇంట్లో ఏ వస్తువులు ఉన్నా చిందరవందర చేస్తూ ఉండేవాడు. కొడుకుపై మమకారంతో తల్లిదండ్రులు ఏమీ అనేవారు కాదు.
చంద్రయ్య బాగా ఆలోచించాడు. ప్రతిరోజు విజయ్ బడి నుంచి రాగానే తీసుకువెళ్లి, పెరట్లో చెట్ల దగ్గర కూర్చోపెట్టేవాడు. విజయ్ ను ప్రతిరోజు చెట్లను పరిశీలించమన్నాడు. పక్షులు కొమ్మల మధ్యలో రోజు కొంతకొంత గూటిని నిర్మించుకోసాగాయి. కొన్ని రోజుల్లోనే ఆగూటిలో గుడ్లు పెట్టి, పిల్లలను చేశాయి. పిల్లలు పెద్దగా అయ్యాక పక్షి, పక్షి పిల్లలు ఎగిరిపోయాయి. కానీ గూడు మాత్రం అలానే ఉంది. మేం వెళ్తున్నామని తాను నిర్మించిన గూటిని పక్షి చిందర వందర చేయలేదు. ఆగూటిలో కొద్ది రోజులు వివిధ ప్రాణులు కూడా జీవించసాగాయి. అప్పుడు విజయ్ తన తప్పును తెలుసుకున్నాడు. అప్పటినుంచి ఇంట్లో చిందరవందర చేయడం మానివేశాడు. విజయ్ లో వచ్చిన మార్పును చూసి చంద్రయ్య సంతోషించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి