ఇటీవల పదవీవిరమణ గావించిన వాండ్రంగి గౌరీ కుమార్ ను పూర్వ విద్యార్ధులు ఆత్మీయ సత్కారం గావించారు. బొద్దాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేసి గతనెలలో పదవీవిరమణ గావించిన గౌరీ కుమార్ ను, రెండు దశాబ్దాల క్రితంనాటి తన శిష్య బృందం తమ కృతజ్ఞతా పూర్వకంగా ఆత్మీయతతో సన్మానించారు.
నేడు ఉద్యోగ, ఉపాధి రీత్యా వేర్వేరు ప్రాంతాలలో నివాసం ఉంటున్న ఆ పూర్వ విద్యార్థులు తమకు విద్యా బుద్ధులనందించిన గురువుగారిని గుర్తుంచుకొని పదవీ విరమణ పొందారని తెలుసుకొని సన్మానాన్ని చేసి తమ గురుభక్తిని 2004-05 విద్యార్థులు చాటుకున్నారు. ఇదే వేదికపై ఇటీవల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన పి.కృష్ణారావును సన్మానించారు. బొద్దాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు డి.కృష్ణారావు, వి.రాజ్యలక్ష్మి, ఆంగ్లోపాధ్యాయులు బి.వి.అచ్యుత్ కుమార్, హిందీ ఉపాధ్యాయులు పి.కృష్ణారావు, పూర్వ విద్యార్థులు జి.కనకరాజు, జి.సంతోష్, ప్రమీల, మహాలక్ష్మి, పి.రేఖ, బి.ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి