అమరకోశం రాసిన వాడు అమరసింహుడు.శివశబ్దానికి వ్యాఖ్యానం చేశాడు.శుభం శాంతం కల్యాణం అని అర్థం.ప్రతి ప్రాణికి 6వికారాలుంటాయి.పుట్టటం ఉండటం పెరగటం తరగటంనశించటం.ఈవికారాలకు అతీతం పరబ్రహ్మం నిరాకారుడు నిరంజనుడు.ఒక గొడుగు లాగా సదా శివ స్మరణ చేస్తూ ఉంటే కాపాడే వాడు ఆశివుడే! శివభక్తులు 63 మంది నాయనార్లు.కలయనాయనార్ కి గుగ్గిలం నాయనార్ అనేపేరుంది.ఆయన శివాలయంలో రోజు గుగ్గిలంవేస్తూ భక్తి తన్మయత్వంతో రమించిన మహా శివభక్తుడు.ఇంట్లో భార్య పిల్లలు ఆకలితో అల్లాడుతున్నారు.భార్య తన మంగళసూత్రాలు ఇచ్చి " సరుకులు పట్టుకుని రండి" అంది.శివుడు అతని భక్తిని పరీక్షించడానికి బండీలో గుగ్గిలం తో బైలుదేరాడు.నాయనార్ వెంటనే మంగళసూత్రాలు ఇచ్చి ఆబండీలోని గుగ్గిలం తీసుకుని శివాలయంలో గుగ్గిలం ధూపంలో భక్తి లో మునిగి పోయాడు.శివుడు అతని భక్తికి మెచ్చి అతని ఇల్లంతా సంపదతో నింపాడు.అతనిభార్యకు అశరీరవాణి ఇలా చెప్పింది " నీ భర్త సమాధి స్థితిలో శివాలయంలో కూచున్నాడు.అతని భక్తికి మెచ్చి శివుడు మీ కుటుంబాన్ని సిరిసంపదలతో నింపాడు."ఈనాయనార్ వంగిన శివలింగాన్ని తన మెడకి ఇనుప గొలుసుతగిలించి లాగి సరిచేశాడు.
ఇలాంటి భక్తి శక్తి సంపన్నులు నడిచే దైవం కంచి పరమాచార్యులవారు.ఆయన శ్రీశైలం లో హటకేశ్వరం అనే ప్రాంతంలో తపస్సు చేయాలని అనుకున్నారు.అక్కడ ఆదిశంకరులు తపస్సు చేశారు.కానీ ఆయన భక్తులతో అన్నారు " నా బాధ్యతలన్నీ జయేంద్ర సరస్వతి కి అప్పగించాను.ఇక్కడే ఉంటా సమాధి స్థితిలో!" కానీ భక్తుల కోరిక పై ఆయన కంచి తిరిగి వచ్చారు.
కొసమెరుపు.. గొప్ప మహాత్ములు శరీరం విడిచిపెట్టాక వారి సమాధిపై తులసి మొక్క నుపెంచుతారు.దాన్ని బృందావనం అంటారు.రమణమహర్షిది అధిష్ఠానం.🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి