సోమవారం భస్మధారణ తప్పనిసరి. విభూతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ విభూతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ వుంటాడు. నరకబాధలు లోనుకాకుండా చూస్తాడు. భస్మాన్ని ధరించడం ద్వారా శరీరంలోని అధిక శీతలతను పీల్చుకొంటుంది. జలుబు, తలనొప్పులు రాకుండా కాపాడుతుంది. భస్మాన్ని నుదుట ధరించేటప్పుడు మృత్యుంజయ మంత్రాన్ని స్తుతించాలని ఉపనిషత్తులు చెప్తున్నాయి. మన శాస్త్రాల ప్రకారం స్వల్పభస్మధారణ, మహాభస్మధారణ అనే రెండు రకాలైన పద్ధతులున్నాయి. ఈ పద్ధతులలో ముప్ఫయి రెండు స్థానాలలో గానీ, పదహారు చోట్లకానీ భస్మధారణ చేయాలి. లేదా కనీసం అయిదు తావులందైనా భస్మమును ధరించాలి. ఇవి ఏవీ కుదరనప్పుడు త్రిపుండ్రాలనైనా ధరించాలి. దీనిని సద్యోజాతాది పంచమంత్రాల పూర్వకంగా ధరించడం మరింత విశేషం. ఆయా మంత్రాలు తెలియని వారు కనీసం ‘ఓం నమ: శివాయ’ అని స్మరిస్తూనైనా భస్మధారణ చేయాలి. ఆవుపేడతో చేసిన భస్మము అత్యంత శ్రేష్ఠమైనది. త్రివేణి స్నాన ఫలం సంప్రాప్తమౌతుంది. భస్మధారణ చేయడం వల్ల అనేక రకాల పాపాలు నశించి పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. భస్మానికి ‘విభూతి’ అని కూ డా పేరుంది. విభూది- అంటే ఐశ్వర్యం. అగ్ని కూ డా ఐశ్వర్యకారకుడు. అందుకే అగ్నిసారమైన భస్మం వర్చస్సునీ, ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తుంది.
విభూదిలో మంత్రశక్తిని నిక్షిప్తం చేయవచ్చు. అం దుకే విభూది ద్వారా రక్షణని కల్పించుతారు. దుష్ట శక్తుల దృష్టి పడకుండా విభూది రక్షిస్తుంది. ఇది హిందూమత చిహ్నం. విభూదితో పాటు చందనం, కుంకుమ ధరించడం మన సంప్రదాయం.అగ్నికి దహించే గుణం ఉంది. కట్టెలు, పిడకలు మొదలైన వాటికి దహనమయ్యే గుణం ఉంది. ఈ రెండింటి సమ్మేళనంతో ఉద్భవించిన విభూతి, ఆ రెండు గుణాలనూ త్యజించి శాశ్వత రూపాన్ని సంతరించుకుంది.శ్రీ మహాగణపతి హోమంలోని భస్మాన్ని ఉపయోగిస్తే అన్ని పనులు నిరాటంకంగా జరుగుతాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఇంట్లో ఉండే కలహాలు తొలగి అందరికీ శాంతి లభిస్తుంది. శ్రీ దుర్గా హోమంలోని భస్మాన్ని ధరిస్తే సకల శత్రువుల నాశనం జరిగి ప్రశాంతత గల జీవితాన్ని సాగించవచ్చు. శ్రీ ధన్వంతరి హోమంలోని భస్మాన్ని ధరిస్తే అన్ని రోగాలు నివారించబడి దేహం వజ్రసమానంగా మారుతుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి