న్యాయాలు -625
భద్ర ఘట న్యాయము
*****
భద్ర అనగా మంచిది,సుఖకరమైనది,సమృద్ధమైనది, శుభము,ముఖ్యము, అనుకూలము, ప్రియము,సుందరము, సౌభాగ్యము. ఘట అనగా మట్టితో చేసిన కుండ, కూజా, నీరు పోసుకును పాత్ర, కుంభరాశి , ఏనుగు,,కుంభ స్థలము, ఉచ్ఛ్వాస నిశ్వాసాలములను నిలుపు చేయుట, ఇరువది ద్రోణముల పరిమాణము అనే అర్థాలు ఉన్నాయి.
భద్ర ఘట అంటే లాటరీ తీసిన పాత్ర అనే అర్థం కూడా ఉంది.హిందూమతంలో దీనినే పూర్ణ ఘట, సోమ కలశం,చంద్ర కలశం,ఇంద్ర కుంభ,పూర్ణ ఘటం,పూర్ణ విరకాంశ, భద్ర ఘట లేదా మంగళ ఘట అని కూడా అంటారు.
ఈ పాత్ర యొక్క గుండ్రని రూపం దాని పవిత్రమైన సంపూర్ణత లేదా సమృద్ధిని సూచిస్తుంది. ఇది సాధారణంగా ఇత్తడి,రాగి, బంగారం లేదా వెండి వంటి లోహాలతో తయారు చేయబడుతుంది.ఈ కలశం నోటి నుండి ఉద్భవించే ఆకులు ఒక పార్శ్వ సమరూపతను అనుసరించి వర్ణించబడింది.
ఈ కలశ ఆరాధన ఋగ్వేదంలో వర్ణించబడింది.యిది యజమాని లేదా పోషకుడిచే నిర్వహించబడే దైవిక అనుగ్రహం యొక్క పాత్రగా శ్రేయస్సు, సమృద్ధిని సూచిస్తుందని వివరించబడింది. యజుర్వేదంలో కలశాన్ని సృజనాత్మక గర్భంతో పోల్చారు.అక్కడి నుండే అన్ని జీవులు ఉద్భవించాయనే తాత్విక చింతన కలదు . ఇందులో ఘట రూపాన్ని పూర్ణ ఘటగా,భద్ర ఘటగా చెప్పడంతో పాటు మానవ మానవ శరీర రూపంగా కూడా చెబుతోంది. అంతే కాకుండా విశ్వం యొక్క సూక్ష్మ రూపంగా కూడా దీనిని చెప్పడం విశేషం.
ఈ విధంగా అప్పుడే కాదు ప్రస్తుత కాలంలో కూడా ఈ భద్ర ఘటం అత్యంత పవిత్రమైన, పూజనీయమైన అర్థంతో హిందూ సంస్కృతి సంప్రదాయాలలో, ఆచారాలలో ఉపయోగించబడుతున్నది. అయితే ఈ భద్ర ఘట లేదా పూర్ణ కలశాన్ని నీరు లేదా బియ్యంతో నింపుతారు. నోటిఫై కొబ్బరికాయ మామిడి ఆకులు అమర్చి ఉత్సవ సమయంలో ఉపయోగిస్తారు.హిందువులు చేసుకునే సత్యనారాయణ స్వామి వ్రతం, వరలక్ష్మి వ్రతం, గృహ ప్రవేశం, వివాహం కార్యాలయ ప్రారంభోత్సవాలలో ఈ భద్ర ఘటము/ పూర్ణ కలశము ఆరాధన, పూజ తప్పనిసరిగా చేస్తున్నారు.
అయితే ఈ కలశం భూమికి, గర్భానికి ప్రతీకగానూ, అందులో పోసిన నీరు ప్రకృతి యొక్క జీవనాధార సామర్థ్యం గానూ, మామిడి ఆకులు ప్రేమకు సంబంధించినవిగానూ, కొబ్బరికాయ శక్తి మరియు శ్రేయస్సు రూపంగానూ మన పెద్దలు చెబుతుంటారు.అందుకే కలశాన్ని చూడగానే మనకు దైవ స్వరూపంగా కనిపిస్తుంది.
సమృద్ధి, జ్ఞానం మరియు అమరత్వానికి చిహ్నం ఈ కలశం.అందుకే ఆయా పూజలు ,శుభ కార్యాల సమయాల్లో కలశారాధన అనేది తప్పనిసరిగా ఉంటోంది.
ఆధ్యాత్మిక వాదులు ఈ కలశంలో అమృతం ఉందని అంటారు అదెలాగంటే జీవితం యొక్క అమృతం . జీవితం యొక్క అమృతం అంటే మానవ శరీరంగా మనం చేసుకున్న పుణ్యం , చేసే శుభ కార్యాలు వాటి ద్వారా ఎదుటి వారు ఇచ్చే దీవెనలు.
ఈ "భద్ర ఘట న్యాయము" ద్వారా ముఖ్యంగా మనం తెలుసుకోవలసిన విషయాలు చాలానే ఉన్నాయి.అవి ఏమిటంటే భద్ర ఘట అంటేనే శుభప్రదమైన కలశం మరియు మానవ దేహానికి నమూనాగా చెప్పారు కదా కాబట్టి మానవులమైన మనం ఆదర్శవంతమైన కుటుంబ బంధాలను నెరుపుతూ సత్సంతానాన్ని వృద్ధి చేసుకోవాలని, జీవనాధారమైన జలమును కలుషితం కాకుండా చూడాలని, మామిడి ఆకులు వృక్ష సంపద మూలాలు మరియు ప్రేమకు సంబంధించినవి కాబట్టి చెట్లను ప్రేమగా పెంచుకోవాలని, కొబ్బరికాయలా ధృఢమైన మానసిక స్థితి కలిగి ఉండాలని అర్థం.
అలా నిండుగా శాంతి సౌభాగ్యాలను ఇచ్చే భద్ర ఘటము వలె మన జీవితం ప్రకృతిలో ప్రకృతిగా మమైక్యమై పోవాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి