శ్రీ శిరిడీ సాయినాథుల వంటి కలియుగదైవం, సమర్ధ సద్గురువు, పరిశుద్ధ పరమేశ్వర అవతారం యావత్ కలియుగంలో ఇంతవరకూ అవతరించలేదు. ఆయన తన భక్తజ నులకు ఇహ, పర విషయాలలో తగిన సూచనలను ఇచ్చి వారు జీవిత పరమావధి పొం దేటట్లు చూస్తారు. కొన్ని సందర్భాలలో తన అభయ హస్తాన్ని భక్తుల తలపై వుంచి తన యోగ శక్తిని వారిలో ప్రవహంపజేసి వారికి అనిర్వచనీయమైన ఆధ్యాత్మికానుభూతిని కలుగజేసేవారు. పలు సందర్భాలలో భగవంతుని లీలలు కంటే భగవద్భక్తుల లీలలను కీర్తించేవారు గొప్ప అని తెలియజేస్తుండే వారు. శ్రీ సాయి తన భక్తులపై కనబరిచే ప్రేమ తల్లి ప్రేమ కంటే ఎన్నో రెట్లు గొప్పది. శ్రీ సాయి సచ్చరిత్రలో శ్రీ సాయి తన భక్తులపై అంతులేని ప్రేమానురాగాలను వర్షించిన సంఘటనలు వందలాదిగా దర్శనమిస్తాయి. వాటిని పారాయణ చేస్తే మనస్సులో ఆనంద తరంగాలు ఉవ్వెత్తున లేస్తాయి. శ్రీ సాయి వంటి సద్గురువుకు భక్తులమైనందుకు ఎంతో గర్విస్తాము.శ్రీ సాయి శిరిడీకి వచ్చిన తొలొ రోజులలో ఆకుపచ్చని కఫ్నీ , తలకట్టు ధరించి, సటకా చేత పట్టుకొని, నిత్యం ఆ గ్రామంలో కేవలం అయిదు ఇళ్ళలో మాత్రమే భిక్షాటనం చేసేవారు. అంతే కాక, ఆయన రోగులకు ఉచితంగా వైద్యం చేసేవారు. ఇతర వైద్యులవలే కాక శ్రీ సాయి వైద్యవిధానం చాలా విభిన్నంగా వుండేది. ఒకసారి శిరిడీ గ్రామంలో గణపతి హరికణాడే అనే ఒక భూకామందుకు కుష్టువ్యాధి వచ్చింది. బాబా యొక్క అనుగ్రహఫలితంగా ఆ వ్యాధి వెంటనే తగ్గిపోయింది. కానీ బాబా అతనికి విధించిన కొన్ని కట్టుబాట్లను హరికనాడే ఉల్లంఘించడంతో ఆ వ్యాధి మళ్ళీ ప్రాణాంతకంగా తిరగబెట్టి కొద్ది రోజులలోనే అతను మరణించాడు.హరికణాడే మరణ వార్త విన్న శ్రీ సాయిలో ఒక విధమైన పరవర్తన వచ్చింది. " ఈ మనుషులు ఎంత పిచ్చివారు? వారి మంచి కోరి చెప్పినా , తమకు నచ్చిందే చేస్తారు కాని మొరొకటి చెయ్యరు గాక చెయ్యరు"అనుకొని ఆనాటి నుండి రోగులకు మందులు ఇవ్వడం మానేసి తాను శిరిడీలోని మశీదులో తన యోగశక్తితో వెలిగించిన పవిత్రమైన ధుని నుండి వచ్చే బూడిదను ప్రసాదంగా ఇవ్వసాగారు.శ్రీ సాయి తన భక్తులకు ఆశీర్వదించి ఇచ్చే బూడిదనే ఊదీ(విభూతి) అని అంటారు. అది ఆరోగ్యమును, ఐశ్వర్యమును ప్రసాదించడమే గాక సమస్త దుఖములను, భయాందొళనలను దూరం చేసేది.
సమర్ధ సద్గురువు శ్రీ సాయి లీలావైభవం;- సి.హెచ్.ప్రతాప్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి