జెమ్ & కో... చెన్నైలోని ప్యారిస్ కార్నర్‌లో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతంలో 1928 నుండి కొనసాగుతున్న సంస్థ. ఈ సంస్థకు చెన్నై చరిత్రపుటల్లో ఓ ప్రత్యేక స్థానం ఉంటుందనడం అతిశయోక్తి కాదు. భారతదేశపు పురాతన పెన్ స్పెషలిస్ట్‌లలో ఒకటిగా ఈ సంస్థ మారిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
ఎం. సి. కున్నన్, వెంకటరంగం చెట్టి విభిన్నంగా ఏదైనా చేయాలనే ఆలోచనతోనే ఈ సంస్థను ప్రారంభించారు. వీరిద్దరూ ఫౌంటెన్ పెన్నులను తమ ఉత్పత్తిగా ఎంచుకున్నారు, ఆ సమయంలో, ఈ పెన్నులు విదేశాల నుండి దిగుమతి అయ్యేవి.
గామా (Gama) అనేది జెమ్ అండ్ కో (Gem & Co.) అంతర్గత బ్రాండ్. ఇది మొదట చెన్నైలో ప్రారంభమైంది. ఆప్పటివరకు ఇంగ్లాండ్‌లో తయారవుతూ వచ్చిన పెన్నులు చెన్నైలోనే తయారుచేయడానికి నడుంబిగించారు.
గామా పెన్నులు ఒక ప్రత్యేకమైన ఎబోనైట్‌తో తయారైనవే. వీటిని కళాకారుల పనితనం చూసి తీరాల్సిందే. వారి కళాత్మకత కు ఇవి నిజంగా మాస్టర్ పీస్‌లే. ప్రతి ఒక్కటి అందమైన నమూనాలను కలిగి ఉంటాయి.
కంపెనీ వ్యవస్థాపకుడు, దివంగత ఎం.సి. కున్నన్, 1920లలో పెన్నులు తయారు చేయడం ప్రారంభించారు. అనంతరం వ్యాపారాన్ని తన మనవడు ప్రతాప్ కుమార్‌కు అప్పగించారు. గామా పెన్నులు ఇప్పటికీ ఎబోనైట్, యాక్రిలిక్, సెల్యులాయిడ్‌తో సహా సాంప్రదాయ పద్ధతులు, పదార్థాలను ఉపయోగించి తయారు చేస్తారు. అందమైన డిజైన్‌లకు గామా పెన్నులు ప్రసిద్ధి.
ఆధునిక యుగంలో బడా సంస్థల నుండి ఎదురవుతున్న పోటీని తట్టుకుని ఈ సంస్థ నిలబడటం విశేషం. సవాళ్ళను అధిగమించి ప్రత్యేకమైన, క్రియాత్మకమైన అధిక - నాణ్యత గల పెన్నులను ఉత్పత్తి చేయడానికి కంపెనీ కట్టుబడి ఉంది. పెన్నులు సేకరించేవారు, చక్కటి వ్రాత పరికరాలను ఇష్టపడేవారు తప్పనిసరిగా ఈ పెన్నులనే ఎంచుకుంటారు. అందుకే ఇప్పటికీ ఈ సంస్థ ఫౌంటెన్ పెన్నుల ప్రపంచంలో అగ్రగామి కంపెనీగా ఉంది. గతానికి వర్తమానానికి మధ్య వారధిగా ఉందీ సంస్థ.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి