పాతపొన్నుటూరు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావును ఆ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు గురుపూజోత్సవం సత్కారం గావించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం వేదికపై శాలువా జ్ఞాపిక లతో వారిని ఘనంగా సన్మానించారు. తొలుత సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాలబాలికలంతా ఉపాధ్యాయులందరికీ పలు కానుకలతో సత్కరించి గురుభక్తిని చాటుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు, సహోపాధ్యాయులు అందవరపు రాజేష్, పైసక్కి చంద్రశేఖరం, బూడిద సంతోష్ కుమార్, ఇశాయి సౌజన్యవతి, బొమ్మాళి నాగేశ్వరరావు, కుదమ తిరుమలరావులు సర్వేపల్లి జీవితాంశాలను, ఉపాధ్యాయ వృత్తి విలువలను గురించి ప్రసంగించారు. విద్యార్థుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు నిర్వహించిన స్పూన్ లెమన్, టగ్ ఆఫ్ వార్, హేండ్ కర్చీఫ్ పోటీల్లో ప్రథమ ద్వితీయ విజేతలైన కృష్ణారావు, రాజేష్, చంద్రశేఖరం, సంతోష్ కుమార్, సౌజన్యవతి, నాగేశ్వరరావు, తిరుమలరావులకు బహుమతి ప్రదానం చేసారు. కుదమ తిరుమలరావు రాధాకృష్ణన్ పుట్టిన రోజు స్వీయ గీతాన్ని ఆలపించి సభను రంజింపజేసారు. అనంతరం విద్యార్థులు కేక్ కట్ చేసి, మిఠాయిలను పంచిపెట్టారు.
పాతపొన్నుటూరు హెచ్ ఎమ్ కు టీచర్స్ డే సత్కారం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి