తిరుమలరావుకు ఉత్కళ ప్రశంసాపత్రం

 కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావుకు మరో అరుదైన గౌరవం లభించింది. వాడుక భాషా పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా, ఉత్కళ తెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో తెలుగు తల్లి వెలుగుకి రెపరెపలా అనే అంశంపై నిర్వహించిన జూమ్ సమావేశంలో తిరుమలరావు పాల్గొని తన కవితా గానం వినిపించి ప్రశంసలు పొందారు. ఈ మేరకు ఒడిషా రాష్ట్రం గజపతి జిల్లా పర్లాకిమిడి కేంద్రంగా ఉత్కళ అధ్యక్షురాలు, కవయిత్రి డా.పాండ్రంగి శారద, ఉపాధ్యక్షులు కందికొండ రవికిరణ్, పర్యవేక్షకులు నేరెళ్ళ మాల్యాద్రి, కవితా సమీక్షకులు సాదనాల వెంకట స్వామినాయుడు, బొల్లా ప్రగడ రామారావులు తిరుమలరావు ప్రతిభను అభినందిస్తూ ప్రశంసా పత్రాన్ని పంపారు.
కామెంట్‌లు