విజ్ఞాన విహార యాత్రలు (గేయం);- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
పల్లవి:
విజ్ఞాన విహార యాత్రలు
మానవ అభిరుచికి గవాక్షాలు
మన విశ్వవీక్షణకు ద్వారాలు2
చరణం 1
సువిశాలమైనదీ ప్రపంచం
మనవూరందులోఅణుభాగం2
మనంపర్యటించేదెంతోవుంది
మనంచూసిమురిసేదెంతోవుంది2
చరణం 2
ప్రపంచ వింతలన్నీ 
పరిశీలించి చూడొచ్చు2
గతకాలపు చరిత్రనంత
గ్రంథస్థం చేయోచ్చు2
దేశదేశాల సంస్కృతి సంప్రదాయం చూసిమురిసిపోవొచ్చు2
చరణం 3
జాతీయ ఐక్యతను
పెంచుకోవొచ్చు2
వేషభాషలు అభిరుచులు
సొంతంచేసుకోవచ్చు
సంతోషంగా బ్రతుకొచ్చు2
చరణం 4
బాయిలోకప్పలా.. ఎంతకాలం బ్రతుకీడుద్దాము2
ఒడ్డుకు చేరి చూస్తే ..భూతలమే స్వర్గధామం...2
చుట్టి వద్దాం ...దేశదేశాలు...
పదిలపరుచుకుందాం
మధుర జ్ఞాపకాలు....2

కామెంట్‌లు