స్ఫూర్తిప్రదాతలు 54సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ

 తమిళనాడులో ఓగ్రామం పేరు ఎత్తనయకన్పట్టి.అక్కడున్న బడికి15 పల్లెలనుంచి పిల్లలు వచ్చే వారుకానీ వారి సంఖ్య తగ్గింది.ప్రభుత్వ బస్సులు లేక పోవడం నడిచేటప్పుడు రోడ్డుప్రమాదాలు కారణం అని తెలుసుకున్న తిరుసెల్వరాజ  సొంత డబ్బుతో 4 బస్సులుకొని ఇళ్లవద్దనే పిల్లల్ని ఎక్కించటంతో పిల్లలు చేరారు.పండ్లు కూరగాయలను పండిస్తూ పిల్లల చేత తోటపనితోపాటు వారికే పంచుతున్నాడు కేరళకు చెందిన భీమేష అనే రైతు నది దాటడంకోసం 50కె.జి.ల బరువుమోసే రోప్ వే ను ఏర్పాటుచేశాడు. 2లక్షలు ఖర్చు పెట్టాడు. ఇప్పుడంతా ఖుషీ! ఒడిషా కిచెందిన ట్రక్ డ్రైవర్ పంకజ్ కుమార్ రోడ్ ప్రమాదంలో చావుబ్రతుకులమధ్య ఉన్న పిల్లల్ని ఆసుపత్రిలో చేర్చి కాపాడాడు. తను వ్యాన్ కొని యాంబులెన్స్ గా మార్చారు.వారికి సరుకులు సొంత ఖర్చుతో ఇస్తాడు.500మంది ప్రాణాలు కాపాడిన ప్రాణదాత🌹
కామెంట్‌లు