శివ శివ అనుకుంటూ
శివనామం వినుకుంటూ
కొలువాలిరా ఆ శివుని
తలువాలిరా ఆభవుని !
మా దేవుడే ఆ శివుడు
మా జీవుడే ఈ భవుడు
తెలుసుకో నీవిప్పుడు
కలుసుకో ఎల్లప్పుడు !
ఈశుడే దేహంలో ఉన్నాడంటూ
పరమేశుడే ఇక మనవాడంటూ
తెలుసుకోవాలి ఇక నీవి సత్యం
తలుచుకోవాలిక ఈ పరమ సత్యం
హర హర అనుకుంటూ
ఆ హరరుడే ఇక దిక్కంటూ
పూజించాలిక ఈ హరుని
సేవించు ఇక ఆ మనోహరుని !
హర హర అని ఇక అందాం హరుని ఆలయంలోఉందాం
ఆడుదాం పాడుదాం అంతా
మనకు ఉండదులే ఏ చింతా !
హరుడేరా మన దైవం
పామరుడా ఈ వైనం
గుర్తించి నీవు ప్రార్థించు
అర్థించి మోక్షం సాధించు !
పార్వతి నాధుని ప్రార్థించు
మామొర వినమని అర్థించు
ముక్తికై నీభక్తిని ఆపాదించు
శక్తి వ్యక్తితో నువ్వు సాధించు !
మా విఘ్నేశ్వర ఓ జనకా
మా గోడును నీవు వినకా
ఉండొద్దురా మమ్ము కానకా
అండగా ఉండే ఓమాఏలికా!
ఈ హరిహరుడు మా దేవుడు
అఖిల జగానికి మెరిసే భానుడు
అందరి దేహాల్లో వుండే సజీవుడు !
ఈ శివుడు మా దేవుడు ఐనందుకు
మామది వెళ్ళను ఆనందం విందుకు
వ్యవధి లేకే పూజా పునస్కారం అందుకు
భక్తులందరూ రారండి ఇక మా ముందుకు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి