శివానందలహరి:- కొప్పరపు తాయారు.

 శ్లో:
ఏకో వారిజభాంధవః క్షితినభోవ్యాప్తం తమోమండలం
భిత్వా కిం లోచనగోచరోపి భవతి
త్వం కోటి సూర్య ప్రభః
వేద్యః కిం నభవస్యహో ఘనతరం కీదృగ్భవేన్మత్తమ.
స్తత్సర్వవం వ్వపనీయ  మే పశుపతే సాక్షాత్ప్రసన్నోభవ!

 
భావం:
  ఓ పశుపతీ ! ఒక్క సూర్యుడు భూమి ఆకాశములను ఆవరించిన చీకటిని పటాపంచలు చేసి కన్నులకు కనపడుతున్నాడు. నీవు కోటి సూర్యుల కాంతి కలవాడవు, అయినను మాకు కనబడకున్నావు ఎందువలన? నా అజ్ఞానము
అనే చీకటి ఎంత దట్టము ఉ‌న్నదో  కదా !
  దానిని తొలగించి నాకు దర్శనమియి స్వామీ!
****

కామెంట్‌లు