రాష్ట్రస్థాయి సాహిత్య పోటీలలో గెలుపొందిన రామంచ విద్యార్థులు

 తెలంగాణ సారస్వత పరిషత్ వారు,బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ రాష్ట్రస్థాయి సాహిత్య పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు. దేవులపల్లి రామానుజరావు కళామందిరం హైదరాబాదులో  విద్యార్థులను ఘనంగా సన్మానించి, బహుమతులతో పాటు, ప్రశంసా పత్రాలను ,అతిథులు కే వీ రమణాచాచార్య,ఆచార్య ఎల్లురి శివారెడ్డి,వరప్రసాద్ రెడ్డి,జర్రు చెన్నారెడ్డి, గరిపల్లి అశోక్ చేతుల మీదుగ అందజేశారు. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ గ్రామం ఉన్నత పాఠశాల విద్యార్థులు ఈ అవార్డులను అందుకోవడం జరిగింది. అవార్డులు అందుకున్న వారిలో. విద్యార్థినిలు. ఆర్ సిరివలిక, వ్యాసరచనలో  500/నగదు  బహుమతి, పాటలో500/ నగదు బహుమతి పొందిన. పి వర్షిణి ఏకపాత్రాభినయంలో 500 /నగదు బహుమతి పొందిన పి.వర్షిణి, పద్య రచనలో 500/నగదు బహుమతి కే గాయత్రి, కథలలో ప్రోత్సాహకామ బహుమతి గెలిచిన విద్యార్థిని ఈ నవీన, వచన కవితలు ప్రోత్సాహక బహుమతి పొందినవిద్యార్థి కే మైత్రి లను   ప్రధానోపాధ్యాయులు సత్తవ్వ, ఉపాధ్యాయులు, భాస్కర్, మల్లయ్య, నరేందర్, గంగాభవాని, ఎల్వి శ్రీనివాస్,  సంతోషి, జమున రాణి, తల్లిదండ్రులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గోని విద్యార్థులను అన్ని రంగాలలో ప్రోత్సహించిన తెలుగు ఉపాధ్యాయురాలు నిర్మలను, విద్యార్థులను అభినందించారు.
కామెంట్‌లు