పిల్లలు చూసింది
ఇట్టే..నేర్చేసుకుంటారు
మనం చేసేపనులు
ఆచరించడానికి
విశ్వప్రయత్నం
చేస్తుంటారు ...
అన్నమాటను ..అలాగే
రిపీటీచేసేస్తారు ...!
మా మనవడు 'నికో '...
దీనికిఅసలే అతీతం
కానేకాదు సుమా....!
చూసింది చూసినట్టు,
ఆటల్లోపెట్టి......
ఆడేస్తాడుయమా!
మాటలింకారాలేదుగాని ,
అన్నమాటలు
అవలీలగా ---
తిరిగిపలికేస్తాడు..!
అమ్మాలు-నాన్నలూ ...
ఇతరసంరక్షకులూ --
బహుపరాక్ ...!
మీరుమాట్లాడే మాటలు
కావాలి పిల్లలకు ...
ఎప్పుడూ తీయని
తేనెల-
మూ ట లు.......!!
***
బహుపరాక్...!!--డా.కె.ఎల్.వి.ప్రసాద్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి