కవిత్వం
సాహిత్య అభివృద్ధికి
ఉత్తమ సాధనం
కవిత్వం
మానవ అభివ్యక్తికి
చరమ స్వరూపం
కవిత్వం
అనుభూతులు తెలపటానికి
సంక్షిప్త రూపం
కవిత్వం
కవుల తలపులకు
ప్రతిబింబం నిలువుటద్దం
కవిత్వం
క్లుప్తత సున్నితత్వాలకు
పర్యాయపదం
కవిత్వం
మదులను తట్టే
మేటి ఉపకరణం
కవిత్వం
శబ్దాల ప్రయోగానికి
తగిన ఆలవాలం
కవిత్వం
పోలికలతో ఆకట్టుకునే
అక్షర నిర్మాణం
కవిత్వం
విషయాల వెల్లడికి
పదాల ప్రయోగం
కవిత్వం
నైపుణ్య ప్రదర్శనానికి
చక్కని నిదర్శనం
కవిత్వం
పాఠకులను అలరించటానికి
సామూహిక పరికరం
కవిత్వం
పఠనావ్యసనానికి గురిచేసే
పదునైన ఆయుధం
కవిత్వం
వ్రాయటం వర్ణించటం
ప్రోత్సహించదగిన వ్యాపకం
కవిత్వం
అమూల్య పరికరం
సక్రమప్రయోగం ఆవశ్యం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి