సుప్రభాత కవిత : -బృంద
మమత పొంగిన నింగికి 
మనసు నిండిన ఏరు 
అరుణ కాంతికి అలుముకున్న 
అందమంటే ఇదే!

అలకలన్ని  తీరాక 
అందమైన బంధమేదో 
అల్లుకున్న తీరున 
అవరించే వెలుగులవే!

కలల కౌగిట కరిగిన 
కమ్మని భావతరంగాలు 
కనుల ముందు కనపడి
కదిపి పోవా ఊహలతుట్టెను!

అరుదుగా అలరించే 
ఆనందమేదో కలుగగా 
అరవిరిసిన అరవిందమై 
అంతరంగము వింతగా!

ప్రేమ పరిమళం పరచుకుని 
ప్రాణమంతా తేలిపోగా 
పరవశాన అడుగులేమో 
పరుగుతీసె ప్రకృతిలో!

సంబరాలే అంబరమంటగ
సడి లేని సవ్వడేదో 
సిరులు కురిసే గుండెలోన 
సిరి మువ్వగా మోగెనేమో!


కామెంట్‌లు