శ్లో:! శంభధ్యాన వసంతసంగిలి హృదారామే ఘజీర్ణచ్ఛదా
స్స్రస్తా భక్తిలతాచ్ఛటా విలసితా పుణ్యప్రవాళ శ్రితాః !
దీష్యంతే గుణ కోరకా జపవచఃపుషాశ్చ సద్వాసనాః
జ్ఞానానంద సుధా మరందలహరీ సంవిత్ఫలాభ్యున్నతిః !!
భావం: ఈశ్వర! మీ ధ్యానము వసంత రుతువుతో సంబంధము ఏర్పడగా నా హృదయమనే పూలతోటలో పాపములు అన్ని ఎండి టాకులవలె రాలిపోయి పుణ్యములు చిగురుటాకుల వలె మొలిచాయి. సద్గుణములు మొగ్గలు తొడిగాయి. భక్తి అనెడి తీగలు అలుముకొన్నవి
జప, వచనములు అనే పుష్పములు వికసించినవి
అవి ఉత్తమ సంస్కారము అనే సువాసనలు వెదజల్లుతున్నాయి. బ్రహ్మజ్ఞానము ఫలముగా ఉన్నది. నా హృదయము ఉద్యానవనమునకు ఉండవలసిన సర్వలక్షణములతోవిరాజిల్లుతుంది. *****
శివానందలహరి:-కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి