సోమన్న "చిరు మువ్వలు" పుస్తకావిష్కరణ

 పెద్దకడబూరు మండల పరిధిలోని కంబదహాళ్ జిల్లా పరిషత్  ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు  గద్వాల సోమన్న  రచించిన  "చిరు మువ్వలు" పుస్తకావిష్కరణ కార్యక్రమం  విశ్రాంత అటవీశాఖ అధికారి శ్రీ ఎ. యల్.కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో,వారి చిన్న కుమారుడుసాఫ్ట్ వేరే ఇంజనీరు శ్రీ ఎ. చంద్రమోహన్ రెడ్డి, శ్రీమతి శైలజారెడ్డి దంపతుల నూతన గృహ ప్రవేశం సందర్భంగా తెల్లాపూర్, హైదరాబాద్ లో విశ్రాంత భూగర్భ గనుల శాఖ అధికారి డా.శ్రీ వి.డి. రాజగోపాల్, విశ్రాంత అటవీశాఖ అధికారి శ్రీ ఏ.ఎల్.కృష్ణారెడ్డి మరియు విచ్చేసిన ప్రముఖుల చేతుల మీద ఘనంగా జరిగింది.అనతి కాల వ్యవధిలో 58పుస్తకాలు వ్రాసి ముద్రించిన శ్రీ గద్వాల సోమన్న గారిని సన్మానించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ కళారుడు,తెలుగు భాషోపాధ్యాయుడు శ్రీ డి. కేశవయ్య,కవులు శ్రీ కొప్పుల ప్రసాద్, శ్రీ జి.రాజేంద్రప్రసాద్,అరవా రవీంద్ర బాబు మరియు అతిరతిమహారథులు, ఉపాధ్యాయులు శ్రేయోభిలాషులు, సాహితీమిత్రులు మరియు పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు.
కామెంట్‌లు