గునుగు పూల తెలుపు వరుసల మిసిమి
అందాలు పరిచె తెల్ల నల్లకలువల కాంతి
గుమ్మడి పూఎదపై పూసే రూపమే బతుకమ్మ
మత్తెమంతా పసుపు ముఖమంత శోభ
తంగేడు బంగారం తనువంత సుందరం
పూల మనసుల పులకిత వేళ పాటల బతుకమ్మ
ఒక్కొక్క పూవేసి చందమామ పాటలు
ఢిల్లమ్మ!ఢిల్లీ!! పూల పండుగ బతుకున
పిల్లపాపల దీవించు దేవత బతుకమ్మ
చెరువు గట్టుమీద సాయంసంధ్యల ఆట
ఉప్పొంగు జవ్వని గుంపు ముచ్చట్ల ఇంపు
స్తాంబాళాన పూల బతుకమ్మ పేర్చతృప్తి
అమ్మలక్కలు కొలిచేరు బతుకమ్మల చుట్టుచేరి
కొత్త ఆశలదేలి ఆడవారు ఆడిపాడే ఊరు
తుంటరి పిల్లలు పేల్చేరు పుటాసు పొడి
సరదాల సందడి బతుకమ్మ ఆటే
మురిసిన మనసుల కొసరె తెనెలు
ఎంగిలీపూలు సద్దుల పండుగల బతుకమ్మ
బతుకమ్మ పోయిరమ్మని నిమజ్జనం చేసేరు మంగళారతుల
ప్రతియేడాది బతుకమ్మ దీవెనలకై ఎదురుచూస్తూ ఊరు
=======================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి