ఆంగ్ల వత్సర ఆగమనము-2025:- -- గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు,9966414580
ఆంగ్ల నూతన వత్సరము
అరుదెంచెను గొప్పగా
గత వత్సరాన్ని తరిమెను
అత్యంత వేగంగా

అంబరమంత  సంబరాన్ని
మోసుకుని అడుగుపెట్టెను
నింపుతూ ఉత్తేజాన్ని
ప్రేమగా భుజము తట్టెను

ఆంగ్ల వత్సర ఆగమనము
అభివృద్ధికి ఆరంభము
మిగిలిన పాత వత్సర
పనులకిదే శ్రీకారము

గత యేడు వైఫల్యాలు
బేరీజు వేసుకుని ఇక
సాధించాలి విజయాలు
వర్ధిల్లాలి జీవితాలు


కామెంట్‌లు