6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో సోమన్న పుస్తకావిష్కరణలు
 పెద్దకడబూరు మండల పరిధిలోని కంబదహాళ్ జిల్లా పరిషత్  ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు  గద్వాల సోమన్న  రచించిన  59 "తారాజువ్వలు"మరియు 60 "రేపటి వెలుగులు"  పుస్తకావిష్కరణలు 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు,కె.బి.యన్ కళాశాల,విజయవాడలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీ తులసి రెడ్డి,అవనిగడ్డ శాసన సభ్యులు గౌ. శ్రీ డా.మండలి బుద్ధ ప్రసాద్,పద్మశ్రీ డా.కొలకలూరి ఇనాక్,నిర్వాహకులు శ్రీ డా.జి పూర్ణచందు, శ్రీ గుత్తికొండ సుబ్బారావు ,సినీ గేయ రచయి శ్రీ భువనచంద్ర మరియు విచ్చేసిన ప్రముఖుల చేతుల మీద ఘనంగా ఆవిష్కరించారు.అనంతరం ఈ పుస్తకాలు మండలి బుద్ధ ప్రసాద్ గారికి,సాదనాల వేంకట స్వామి నాయుడు గార్లకు అంకితమిచ్చారు.రమారమి 6 వసంతాల కాల వ్యవధిలో  60 పుస్తకాలు రచించి,పలు చోట్ల వాటిని ఆవిష్కరించిన గద్వాల సోమన్న  అవిరళ కృషిని ప్రశంసిస్తూ సత్కరించారు. మరియు అతిరతిమహారథులు, ఉపాధ్యాయులు శ్రేయోభిలాషులు, సా

హితీమిత్రులు మరియు పాత్రికేయ మిత్రులు శ్రీ జి.సూర్యనారాయణ, శ్రీ పి.బాబుశ్రీ ,పత్తిపాటి రమేష్ నాయుడు పాల్గొన్నారు.
కామెంట్‌లు