అనగనగా ఒక నది, ఆ నదిలో ఒక తాబేలు ఉండేది, దానితో పాటు ఒక సాగర కన్య ఉండేది. ఒక రోజు తాబేలు నీటిలో ఈదుతుండగా ఒక మొసలి ని చూసింది అది కూడా తాబేలును చూసింది. మొసలిని చూసిన తాబేలు పారిపోదామని నీటిలో ఈదుకుంటూ పోయి ఒక రాయి చాటుకు దాచుకుంది. అక్కడికి ఒక సాగర కన్య కూడా వచ్చింది. దానికలో ఒక గొప్పతనం ఉన్నది. అది ఏమిటంటే దానిని ముట్టుకుంటే కరెంటు షాక్ తగులుతుంది. సాగర కన్య తాబేలు దగ్గరకు పోయి ఏమైంది నీకు అన్నది. దానికి తాబేలు నన్ను ఒక మొసలి వెనకాల తరుముకుంటూ తినడానికి వస్తుంది అన్నది. అయితే నువ్వు ఇప్పుడు పారిపో నేను నీలాగ మారి మొసలిని తరిమి చంపుతా అన్నది. అప్పుడు వెంటనే తాబేలు పారిపోయింది. తరువాత సాగర కన్య తాబేలుగా మారింది, అప్పుడే అక్కడికి మొసలి కూడ వచ్చింది. వచ్చి తాబేలు ను చూసి నిన్ను ఇప్పుడే తింటాను అని అన్నది. వెంటనే తాబేలు మీదికి దూకింది. అయితే తాబేలుకు తాకగానే మొసలికి కరెంట్ షాక్ వచ్చి చనిపోయింది. తాబేలుతో సాగర కన్య మొసలి చనిపోయింది అని చెప్పింది ఇక నీకు ఏ బాధ లేదని అన్నది. సాగర కన్య మొసలి నుండి నన్ను కాపాడినందుకు నీకు ధన్యవాదములు అన్నది. ఒకే మిత్రమా, ఆపదలో ఉన్న వాళ్ళ ను ఆదుకోవడమే మంచి వారి లక్షణం. ఇప్పటి నుండి మనమిద్దరం మిత్రులం సరే నా అన్నది సాగర కన్య. తాబేలు కూడా సరే అన్నది.
నీతి : ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే మంచివారి లక్షణం.
స్నేహ బంధం :- స్వాగత్ 6.వతరగతి, అయిటిపాముల
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి