పల్లెటూరు : -యం. వినీత, 7తరగతి, జి. ప. ఉ. పాఠశాల అయిటిపాముల, , నల్లగొండ జిల్లా, తెలంగాణ.



 అనగనకు ఒక ఊరు ఉండేది ఒకప్పుడు. ఆ ఊరిలో ప్రజల్లో సంతోషంగా ఉండేవారు అలానే ఆ పల్లెటూరు చాలా అందంగా ఉండేది. ఆ ఊరిలో పెద్దపెద్ద కొండలు ఉండేవి ఆ కొండలపై పెద్ద పెద్ద రాళ్ళ ఉండేవి.ఆ ఊరిలో  చెట్లు కూడా చాలా పెద్దగా పెరిగినవి. ఊరిలో ఒక చెరువు కూడా ఉండేది ఆ చెరువులో స్త్రీలు బట్టలుతికేవారు కొంతమంది పిల్లలు ఈత కొట్టేవారు జంతువులు నీరు తాగేవి, ఆ జంతువులను కొందరు జనం అందులోనే కడిగేవారు.కొందరు చేపలు పట్టేవారు.ఆడ ఇల్లు లు మాత్రం చాలా చిన్నవిగా ఉండేవి అక్కడ పశువుల మేతకు మాత్రం అందరూ కొండమీదికి తీసుకు వెళ్ళి వచ్చేవారు. ఆ ఊరిలో ప్రతి ఇంట్లో పూలు పండ్లు కూరగాయల చెట్లు బాగా పెంచేవారు, ఇవన్నీ పశువుల పెoడతోనే పెంచేవారు. ఇంకా శనగ తోటలు ఇంకా చాలా చాలా రకాల పంటలు పండించేవారు, కొండ మీదికి ఎక్కి చూస్తే పల్లె చాలా అందంగా కనిపించేది. ఇంకా ఊర్లో ఎడ్ల బండి సైకిల్ రిక్షాలు కూడా ఉండేవి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్లాలంటే రిక్షాల మీద, ఎడ్ల బండ్ల మీద కూడా ఎక్కి వెళ్లేవారు , ఆ ఊరిలో ఇంకా బడి, గుడి, మసీదు, చర్చి, గ్రామపంచాయతీ కూడా ఉండేది. ఊరు ప్రజలంతా ఒకరికొకరు కలిసి మెలిసి చేదోడువాదోడుగా పనులు చేసుకుంటూ బ్రతికేవారు. ఎటువంటి పంచాయతీ వచ్చినా గాని గొడవలు లేకుండా పెద్దలు చెప్పినట్టు వినేవారు, ఎవరు కూడా ఎదురు తిరిగేవారు కాదు, కానీ ఈ రోజుల్లో అలాంటి వాతావరణం లేదు స్వార్థం పెరిగిపోయింది. ఎవరన్నా చెపితే వారినే కొట్టడానికి పోయేవారు. ఎవరి గురించి వాళ్లే చూసుకుంటున్నారు, ఇంకొకరి గురించి పట్టించుకోరు.
నీతి :- మంచి వాతావరణం మనుషులను మంచిగా చేస్తుంది.
కామెంట్‌లు