ధర్మాత్ముడు :- బి. శ్రీనిధి, -8వ తరగతి, -జి. ప. ఉ.. పాఠశాల అయిటిపాముల,- నల్లగొండ జిల్లా, - తెలంగాణ
  అనగనగా ఒక ఊరు ఆ ఊరు పేరు సిద్ధాపురం. అక్కడ ఎక్కువ వర్షాలు పడేవి కావు అందుకు పంటలు కూడా సరిగా పండవు వాళ్లకు తాగడానికి కూడా నీరు దొరకదు, మండ పొలాలకు నీళ్లు లేకపోవడం వలన ఆహారం కూడా దొరికేది కాదు అందుకే వాళ్ళు ఆరోగ్యంగా కూడా ఉండరు, వర్షం పడకపోవడం వల్ల చెట్లు కూడా సరిగా లేవు అందుకే చాలా కష్టాలు పడేవారు. అవును ప్రజలందరూ కలిసి ఒకసారి ఒక ఆలోచన చేశారు ఊరి సర్పంచ్ దగ్గరికి వెళ్లి జరుగుతున్న విషయం అంత చెప్పారు. ఊరి ప్రజలందరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తారు  ఏమిటంటే ప్రజలందరూ కలిసి ఒక బోరును వేసుకుందాం కానీ వాళ్ల దగ్గర డబ్బులు లేవు వాళ్లంతా పేదవాళ్లు కానీ ఆ ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడు అతను నేను డబ్బులు ఇస్తాను అనీ మాట ఇచ్చాడు ఊరివాళ్లకు సర్పంచ్ ముందు. ప్రజలందరూ కలిసి ఊరిలో ఆ డబ్బును ఊరిలో ఒక పెద్ద మనిషి దగ్గర  పెట్టి, ఆ డబ్బుతో తర్వాత బోరును వేయించినారు. అప్పుడు ఆ ఉరివారు చాలా సంతోష్ పడ్డారు. తరువాత దానికి కావాల్సిన వస్తువులన్నీ తెచారు మోటర్ బిగించి నీళ్ళను బయటకు పోపిస్తారు అప్పుడు ప్రజలందరూ చూసి అనందపడ్డారు. మన కష్టాలన్నీ తీరినవి అనుకున్నారు. ప్రజలందరు కలిసి ఆ ఊరిలోని ధనవంతుని దగ్గరకు వెళ్లి నీవు మాకు ధర్మాత్మునివి నాయనా అని ఆయనకు థాంక్స్ చెప్పినారు.

నీతి :-అడగకుండానే ఇచ్చే వాడే దాత

.
కామెంట్‌లు