అపార్ధం :-తవిడబోయిన సాయిశ్రీ, -8.తరగతి,-జి. ప. ఉ. పాఠశాల,-కట్టంగూర్,-నల్లగొండ, తెలంగాణ.
 అనగనగా ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో పేద కుటుంబ ఉండేది ఆ కుటుంబంలో రామయ్య తన భార్య అంజమ్మ ఈ దంపతులకు కొడుకు ఉన్నాడు ఆ కొడుకు పేరు రవి. అలాగే ఆ గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ధనవంతులం ఉండేవారు అన్న పేరు సోమేశ్ తమ్ముడి పేరు మహేష్.  ఒకసారి మహేష్ వాళ్ళ ఇంట్లో ఒక వస్తువు దొంగతనం అవుతుంది ఆ దొంగ రామయ్య ఇంటిదగ్గర వేసి పారిపోతాడు, మహేష్ ఆ వస్తువు కొరకు వెతికి వస్తూ ఉంటాడు ఆ క్రమంలో ఆ వస్తువు రామయ్య ఇంటిదగ్గర దొరుకుతుంది అప్పుడు వారు రామయ్య ను చాలా కొడుతూ ఉంటారు. నేను ఆ వస్తువును తొంగిలించలేదు అని చెబుతున్న వినిపించుకోకుండా కొడుతారు ఇంకొకసారి దొంగిలించావో నువ్వు ఈ గ్రామంలో ఉండవు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. రామయ్య వారి కొడుకు రవి ని చదువు  పించడానికి స్తోమత లేదు,  రవికి చదువుకోవాలని ఉండేది కానీ వాళ్ల కుటుంబం మొత్తం కష్టపడితేనే వారు మూడు పూటలా తినగలుగుతున్న రు. ఈసారి సోమేశ్ వాళ్ళ ఇంట్లో చాలా బంగారం దొంగిలించబడింది అప్పుడు వారు ఏమాత్రం ఆలోచించకుండా రామయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ ఇంట్లో మొత్తం వెతుకుతారు ఏమీ దొరకకపోవడంతో రామాయ్య రేపు  నువ్వు నాకు బంగారం తెచ్చి ఇవ్వాలి. ఇవ్వలేదో ఈ గ్రామంలో ఉండవు అని బెదిరించి వెళ్లిపోతారు అప్పుడు రామయ్య చాలా బాధపడ్డాడు అప్పుడు సోమేశ్ తో ఒక వ్యక్తి మీ ఇంట్లో నుండి ఒక సంచి పట్టుకుని వెళ్లడం నేను చూశాను అందులో బంగారం ఉన్నట్లు కనిపించింది అని చెబుతాడు అతను మీ పక్క ఇంట్లోకి వెళ్ళాడు  అని చెప్తాడు అప్పుడు సోమేశ్ పక్క ఇంట్లోకి వెళ్తాడు వెళ్లగానే ఆ ఇంట్లో బంగారం దొరుకుతుంది ఆ ఇల్లు వాళ్ళ తమ్ముడు మహేష్ ది. సోమేశ్ వెంటనే రామయ్య ఇంటికి వెళ్లి నన్ను క్షమించు రామయ్య నిన్ను నేను అపార్థం చేసుకున్నాను నాకు నా బంగారం దొరికింది నేను నీ కొడుకుని చదివిస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు రామయ్య కుటుంబం చాలా సంతోషపడతారు.
నీతి :- నిజం తెలుసు కోకుండాఎవరిని తొందరపడి అపార్థం చేసుకొని ఆపద కలిగించొద్దు.

కామెంట్‌లు