ఓ ఆంజనేయ మా ఆంజనేయ
శ్రీ ఆంజనేయ శ్రీరామాంజనేయ
నీ ఒంటికి మేం సింధూరం రాయ
నీవు రావా చూపించ నీ మాయ!
ఓ అంజనీపుత్ర మా సంజీవ నేత్ర
ఆ సీతన్వేషనే నీ నిరంతర యాత్ర
శ్రీరామబంటువై పోషించిన నీపాత్ర
అమోఘం అద్భుతం నీ ధీర చరత్ర
శ్రీ కేసరి అంజని ముద్దుల తనయ
మాభక్తులు వచ్చిరి పూజలు సేయ
ఏదయా ఆమాభక్తుల పైన నీదయ
నీ దయతో చేయి ఏదో ఒక మాయ
కాలనేమిని సంహరించిన హనుమ
మా కలిమిలేనులను నీవిక కనుమ
మా అందరి మొరను ఇక వినుమ
మమ్ముల కని విని నీవిక బ్రోవుమ!
శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ
ఓరామా అని నువు రాగం తీయ
కని విని వాలి పడెనుగా అసూయ
విన్నావా నీవు ఓ అంజన తనయ!
ఓ వీరాంజనేయ శూరాంజనేయ
అభయాంజనేయ మా వజ్రకాయ
అనగానే ప్రతిధ్వనించేగా ఆలోయ
ఆ ధ్వనివిని తొంగి చూసే ఓ బోయ
శ్రీఆంజనేయ మా శివ ఆంజనేయ
శ్రీరామాంజనేయ ఓ సీతాంజనేయ
అరుణాంజనేయ కరుణాంజనేయ
ఉద్దండ పండిత ఓ మా మహాశయ
విధి సీతారాములను విడదీయ
తిలకించి నీవు సయాము చేయ
సురులే పొగిడిరిగా ఓఆంజనేయ
తరులే పొంగేను పవనాలు వీయ !
శ్రీ ఆంజనేయ ఓ మా ఆంజనేయ
మాత అంజన ముద్దుల తనయ
వచ్చిరి సురులే నీ పూజను చేయ
వచ్చినవారు మెచ్చిరిగా నీ మాయ
ఆ సీతారాములను నువు మోసి
అశోకవనంలో సీతమ్మను చూసి
లంకాదహనము గూడా ఇక చేసి
రాంబంటువు ఐనావు ఓ వనవాసి
మేం అగ్నిశిఖలను ఇక రాజేయ
నీ యజ్ఞములో నెయ్యిని పోయ
నువు మెచ్చివచ్చి చేశావు మాయ
పొందాం నీచల్లని ఛత్రము ఛాయ!
ఆదుకో మమ్ముల ఓ దయామయ
ఆంజనేయా ఓ మా కరుణామయ
ఆ రామ నామాలను నువు రాయ
మెచ్చి వచ్చాం నీ పూజను చేయ !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి