ఓ సాయి సాయి సద్గురు సాయి
మా సానుకూల దేవుడు నీవోయి
గురుబోధనలు మాకు చేయవోయి
వేదవాదనలు ఇక వినిపించవోయి!
ఓ సాయి సాయి సద్గుణ సాయి
నీటి జ్యోతిని వెలిగించినవోయి
మంచిని పెంచి పంచగా రావోయి
వంచన తెంచి ఇక దీవించాలోయి
ఓ సాయి సాయి మా సత్య సాయి
మేం నిత్యం నిన్నే పూజిస్తామోయి
మా బత్యం మాకిక అందించవోయి
అగత్యంతోనే మేం అడిగినమోయి
ఓ సాయి సాయి మా ఓం సాయి
నీవే మా అందరి సద్గుణ సాయి
మము రక్షించగా నీవిక రావోయి
మా మోక్షానికి దారిని చూపవోయి!
ఓ సాయి సాయి మా దివ్య సాయి
సర్వ సంపదలు మా కియ్యవోయి
ఇడుముల ముడుపే కట్టితిమోయి
కుడుముల నైవేద్యం పెట్టితిమోయి
ఓ సాయి సాయి మా కావ్య సాయి
మా కార్యవిధానం నువు కనవోయి
కావ్య రచనా శక్తిని అందించవోయి
భవ్య భవిష్యత్తులో నీవుంచవోయి
ఓ సాయి సాయి ఓం మా సాయి
మా రాం రహీం నీవు ఒకటేనోయి
సాయం అందించగా ఇక రావోయి
గాయం పెంచక నీవిక చూడవోయి!
ఓ సాయి సాయి మా నవ్య సాయి
మాకందరికి సవ్యసాచివి నీవోయి
కాగే నీళ్లలో నీ చేతిని పెట్టితివోయి
భీతొద్దని మా వీపును తట్టితివోయి
ఓ సాయి సాయి మా నిత్య సాయి
మీ అభయ హస్తం అందించవోయి
మా గాయాలకు నవనీతం రాయి
మమ్ము పరామర్శించి వెళ్లిపోకోయి
సాయి సాయి మా సాధన సాయి
మా వేదన వెంటనే నీవు వినవోయి
ఇలలో కలలో నీవే మా దేవుడవు
మాదేహంలో ఉండే మా జీవుడవు
ఓ సాయి సాయి సన్నుతి సాయి
అందరి భక్తుల పెన్నిధి నీవేనోయి
వారిని బ్రోవగా నీవు ఇక రావోయి
వారి బ్రతుకులో వెన్నెల తేవోయి !
ఓ సాయి సాయి మా భవ్య సాయి
దివ్యత్వాన్ని మాకు కలిగించవోయి
దివిసీమకు దారిని చూపించవోయి
దారిలోచేరి మేం పయనిస్తామోయి
సాయి సాయి మా పుణ్య సాయి
అన్యం పున్యం మేం ఎరగమోయి
పున్యంనే మాకు అందించవోయి
ధన్య మగును ఇక మా బ్రతుకోయి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి