ఓ బావా మా బావా !:- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్ .9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
ఓ బావా బావా మీరు
ఎప్పుడు వేంచేశారు ?
నచ్చిందా మా ఊరు
దేవిపురం దీని పేరు !

ఓ బావ బావా ఇక మీరు
చూశారా మా అక్క తీరు
పెడుతుంది తను పోరు
పడుతూనే ఉంది బేజారు  !

కనబడనందుకు  మీరు
పెడుతుంది తను కన్నీరు
కన్నీరుని పన్నీరుగా ఇక
మార్చాలి మా బావగారు !

నీ తలపులలో జీవిస్తూ
నిత్యం నిన్నే ఆరాధిస్తూ
కాలాన్ని తా గడిపేస్తుంది
కన్నీటితోని తడిపేస్తుంది !

ఓ మా బావగారు మీ రండి
మా అక్కపక్కన ఇక చేరండి
మా అక్క కన్నీరు తుడవండి
చక్కగా కాలం మీరు గడపండి !

ఇన్నాళ్లు మీరెందుకు దూరం
ఉండి పెంచారు ఆమెకు భారం
అక్క బ్రతుకాయేను ఇక ఘోరం
తను దుఃఖంలో పడే నిరంతరం !

ఈ సంగతి లేఖ ద్వారా చెప్పితి
స్థితి పరిస్థితి ఇక నేను విప్పితి 
ఐనా రాలేదులే  మీరు అప్పుడు
ఇకనైన చెప్పండి కారణం ఇప్పుడు

ఓ మా మంచి బావగారు  మీరు
మౌనం ఎందుకు పాటిస్తున్నారు
చెప్పండి మీరిక విప్పండి గుట్టిక
అటో ఇటో ఎటో తేల్చండి పట్టిక

మీరు కట్నం కోరుట పెద్ద తప్పు
మన చట్టం చెప్పి కొట్టెను డప్పు
అది మిమ్ముల మసి చేసే నిప్పు
అవునా కాదా నిజమే ఇక చెప్పు !

ఇప్పుడైనా నీవిక  ఆలోచించు
మా అక్కను తీసుకెళ్లి లాలించు
తన తనివి తీర ప్రేమను పంచు
నీవు ఆమె దుకాణం తొలగించు !

అప్పుడు మనలోకలతలు తొలుగు
ఎప్పుడూ ఉండు జీవితాన వెలుగు
ఎల్లప్పుడు అందరికీ మేలు కలుగు
ఇవన్నీ వరకట్నం మరిచితే వీలగు!

అన్ని వివరంగా నేనిక చెప్పాను
నా మదిలోని మాటను నేవిప్పాను
నీవుమారి ఇక మాఅక్కను ఏలుకో
ఈ కట్నం గాయం నుండిక కోలుకో!


కామెంట్‌లు