పూజను చేయమురా ఓ మనిషి
పూజ చేసే విధానమును తెలిసి
ఆ దేవుని పూజను చేయుమురా
పూజను చేస్తే పుణ్యం వచ్చునురా
పూజను చేయమురా ఓ మనిషి
భక్తుల అందరితో ఇక నువు కలిసి
ఆ దేవదేవుని పూజను నువు చేస్తే
నీ బతుకు ఖాతాలో పుణ్యం మస్తే!
పూజను చేయుమురా ఓ మనిషి
ఉండకురా పూజలో నువు అలసి
భక్తితో రక్తితో పూజను ఇక చేయి
నీ బతుకులో వెలయును హాయి !
పూజను చేయుమురా ఓ మనిషి
పూజలో ఉండకురా అలసి సొలసి
స్థిరంగా మనసు ఉండాలని తెలిసి
ఆ దేవుని పూజను చేయుమురా !
పూజను చేయుమురా ఓ మనిషి
ఇరుగుపొరుగుతో నువు ఇక కలసి
ఆ దేవుని మనసులో నువు తలచి
పూజకు వచ్చే వారిని నీవిక పిలిచి
పూజను చేయమురా ఓ నరుడా
ఆ దేవుని పూజను చేయుమురా
దేవుని రథపీఠమును పెట్టుమురా
అందులో మూర్తిని నిలబెట్టుమురా
పూజను చేయుమురా ఓ నరుడా
పూజను చేసేటి మా ఓ పామరుడా
అయ్యవారిని ఇక పిలువుమురా
చెయ్యక పూజలో నీవు ఉండకురా
అనుదినము పూజను చేయుమురా
మన వారందరినీ పిలువమురా
అందరికీ అక్షంతలు పంచుమురా
తీర్థప్రసాదాలను అందించుమురా
అనుదినం పూజను చేయుమురా
దైవరాగమును ఇక తీయుమురా
పుణ్యఫలం నీకు ఇక దక్కునురా
పాపం తొలగి పుణ్యం వచ్చునురా
పూజను చేయుమురా ఓ మనిషి
పునరపి జననం ఉందని తెలిసి
ఇక మరణమును నువు కనిపెట్టు
అందరికీ ఇక వెంటనే చెప్పేటట్టు !
పూజను చేయరా నీవు ఓ మనిషి
చేయకపోతే నిన్నంటరులే పీనాషి
నీవు అలా తినకురా ఇక చీవాట్లు
అప్పుడు కొడతరు అంతా చప్పట్లు
పూజను మరువకుమా ఓ మనిషి
అలసి సొలసినా ఇక తెలిసి తెలిసి
భక్తులందరితో నీవిక కలిసి కలసి
పూజను చేయుమురా ఓ మనిషి
పాప పుణ్యాల ఫలితాన్నిక తెలిసి
పూజ చేయుట కాదులే ఆశా మషి
చేస్తే ఔతావు తప్పక నీవు ఓ రుషి !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి