అక్కా అక్కా మా పెద్దక్క
ముద్దు మురిపాల చుక్క
ఆమె మాటలు పాటలు
సప్త స్వరాల మూటలు !
అక్కా అక్కా మా పెద్దక్క
తీయనైన మా తేనె చుక్క
నిత్యం వేయు మాకు పక్క
అలసట లేకుండ ఎంచక్కా !
అక్కా అక్కా మా పెద్దక్క
మా అందరికి బెల్లం ముక్క
వేస్తుంది టీలోఅల్లం ముక్క
తానిస్తుంది మాకు ఎంచక్క!
అక్కా అక్కా అక్కా మా పెద్దక్క
తేజైన తాజా ఐస్కాంతం ముక్క
తన బావగారి కూతురు బేబక్క
వచ్చి ఇరుక్కుంది తాను ఎర్రక్క !
అక్కా అక్కా మా మంచి పెద్దక్క
తియ తీయని తేనెల మూటక్క
కంట్లో వేస్తుంది కంటిమందు చుక్క
పాపాకు తినిపిస్తుంది పాలబుక్క !
అక్కా అక్కా మా మంచి అక్క
పరిమళించే మంచి గంధం చెక్క
ఆకర్షించే అయస్కాంతం ముక్క
అందానికి అందం మా ఈ పెద్దక్క
అక్కా అక్కా మా మంచి పెద్దక్క
మా లోగిలిలో ఉన్న సక్కని సుక్క
అని అందరికీ చెప్పింది మా సరక్క
ఆ మాటలు విన్నది వెంకటలక్ష్మక్క
అక్కా అక్కా మా యొక్క పెద్దక్క
పట్టుకుంటే జారే పాదరసం ముక్క
నిర్మొహమాటంగా చెప్పేను లక్ష్మక్క
నిమ్మలంగా వినెను మా నిర్మలక్క !
మేం ఐదుగురము అక్కచెల్లెళ్లము
రాయలసీమలో పుట్టి పెరిగినోళ్ళం
తెలంగాణ మా పెద్దక్క మెట్టినిల్లు
రాయలసీమ మానల్గురి పుట్టినిల్లు
అక్కా అక్కా మా ముద్దుల పెద్దక్క
హద్దుల పద్దుల అనుభవాల అక్క
తన జీవితాన సరిచేసుకుంది లెక్క
తృప్తితో జీవిస్తుంది తాను ఎంచక్క
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి