మా సత్యనారాయణకు వందనం:- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్ .9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా
.మా శ్రీ శ్రీ శ్రీ సత్య నారాయణ
మీ నిత్య పూజకు వేళాయని
తొందరపడి అసలే అనుకోవద్దు
వేగిరపడి మీరు వస్తేనే ముద్దు. !

ఇలలో వెలసిన దేవ దేవుడవు
కలలో మరువని మా భానుడవు
విడువము నిన్నిక ఓ మా స్వామి
మా పూజలు అందుకోను రావేమి

అందరి దేవుడవు నీవేనయ్య
సుందర నందన నీవు రావయ్య
నీ నిద్ర నుండి ఇక లేవాలయ్య
మీ భద్రత మాకు ఇవ్వాలయ్య !

మా సత్య పథములో వస్తాము
మీ నిత్య పూజలు ఇక చేస్తాము
నీ దివ్య కథలను మేం వింటాము
నీ దివ్య రూపమును కంటాము. !

ఓ సత్య నారాయణ రావయ్య
 నిత్య పారాయణం చేస్తామయ్య
మాకు తోడు నీడై ఉండాలయ్య
మా ఊరి వాడ దేవుడవేనయ్య !

ఓ నారాయణ మా నారాయణ
హరి నారాయణ ఆదినారాయణ
జే గంట మ్రోగెను గుడిలో గణ గణ
మా సుందర నందన మా రమణ !

ఓ మురహరి శ్రీ హరి నారాయణ
మా నరహరి సిరి సిరి నారాయణ
మెరిసే విరిసే ఓ దినమణి గమనా
మా మొర నీవిక వెంటనే కనుమా.!

ఓ మా జయ సూర్యనారాయణ
మా హరి మయ ఆది నారాయణ
మా వింత గాధను ఇక వినరండి
మా సొంత బాధను ఇక కనరండి !

ఓ మా గజలక్ష్మి శ్రీ శ్రీ శ్రీ నారాయణ
మా ఈ ధనలక్ష్మి శ్రీ మన్నారాయణ
మా మేలుకోరి నీవు రారా  రమణ 
నీ కోసమే మేం చేసే ఈ జాగరణ  

మా సత్యనారాయణ నీకు వందనం
ఓ నిత్య నారాయణ నీకు అభివందనం
నీ కథలు విన్నవారికి నందనందనం
కని విని చెప్పే వారికి అభి చందనం !


కామెంట్‌లు