సత్యాన్వేషణకై ముందడుగు:- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
నన్ను నేను పునర్ 
 నిర్వచించుకున్నాను.

అన్ని సౌకర్యాలు కల్పించిన
మా తండ్రి ఆస్తి పాస్తులను
సునాయాసంగా అనుభవిస్తున్నందుకు
అణా పైసాసంపాదలేనినాకు
అర్హతెక్కడిది.

నాలో ఏదో వెలితిగా నన్ను మౌనమునిని చేస్తోంది.

అంతా మిథ్య అని
లోకమే శూన్యమని 
నిన్ను నువ్వు ఎందుకు
 ఏ కర్తవ్యం నిర్వహణకీ లోకానికొచ్చాననే
 అన్వేషకుడనై

నేను సిద్ధార్థుడు లా
జీవన్ముక్తి కై
ఇహపర సుఖాలు వదిలి
సన్యాసిగా మారి

నాకున్న సంపదను
 ఆపూటకులేని
ఆగర్భదరిద్రులకిచ్చి
 
ఉన్న పలంగా
సత్యాన్వేషణకై
ఈ క్షణమే
నేను వెళ్తున్నాను‌.

సంతృప్తి అంటే 
సకల సౌకర్యాలు అనుభవించడంకాదని
అననుకూల పరిస్థితుల్లో
 సైతం ఒత్తిడి లేకుండా జీవించడమని
నేను గ్రహించాను.

అందుకే నా వాళ్ళనుకునే
 అందరిని నేనొదిలి
 వానప్రస్థాశ్రమానికి
వెళ్తున్నాను


కామెంట్‌లు