పల్లెలు దేశ ప్రగతికి పట్టుగొమ్మలుపల్లెతల్లి వంటిది పట్నం ప్రియురాలు వంటిది.పల్లె నీకేం కావాలంటుంది.పట్నం నాకేమిస్తావంటుంది.పల్లెలు కులాతీత ,మతాతీత సమాఖ్య స్ఫూర్తికి ప్రతిరూపాలు.పల్లె అంటే అదో పెద్ద కుటుంబం.అక్కడ ఎన్నెన్నో వావివరుసలుఆత్మీయతలు అనురాగాలుకల్మషం లేని పలకరింపులుపెళ్ళైన ,చావైనా ఊరుఊరంతా సహాయసహకారాలుపల్లెలో ఉంటే పట్నం మీద మనసులాగుతది.పట్నంలో ఉంటే పల్లెకెప్పుడురావాలనే ఉబలాటం.పల్లెలో దొరికే సహజ ఆహారాలు, ఆక్సిజన్ ఫ్రీ జోన్ఇదంతా పట్నాల్లో ఎక్కడిది.కానీఇప్పుడు పల్లెకూడా తల్లితనానికి దూరమై పట్నమోలే పైపై మెరుగులు దిద్దుకున్నది.ఒకప్పుడు నా పల్లె తాటికల్లు పరమౌషధంగా ఆడమగతాగేటోళ్ళునేడు నా పల్లెల్లో వైన్ షాపులు అడుగడుగునా బెల్ట్ షాపులతో ఇంగ్లీష్ మద్యానికి బానిసైన పల్లెవాసులు.పట్నపు రహదారులవలే సిమెంట్ రోడ్లు ఏర్పాటైనవి.మట్టి ఔషధం సిమెంట్ విషంఈ చిన్న విషయం మరచి మనం ఇంటిముందు సందుగొందులన్నీ సీసీ రోడ్లు వేసుకుంటిమి.ఇప్పుడు నా పల్లెల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయి అంతోకొంతో నీరు దొరికే చోట విషతుల్యమైన ఫ్లోరిన్ ఉందిఆ నీటినీ త్రాగి కాళ్ళు చేతులు వంకరబోయినోలెందరో పల్లెల్లో దర్శనమిస్తున్నరుమునుపటి రోజుల్లో పల్లెల్లో గ్రామదేవతల జాతర్లు జరిగినప్పుడు ఊరుఊరంతా ఒకే వేదికపై పండగ జరుపుకునెటోళ్ళునేడు జాతర్ల నిర్వాహణలో కూడా రాజకీయ జోక్యంతో పార్టీల వారీగా గుడి గోపురాలు ఏర్పాటయ్యాయిపల్లెకు ఆయువుపట్టైన చెరువులు కుంటలు వాగులు వంకలు అన్నీ అన్యాక్రాంతమైనవి దోపిడీకి గురయ్యాయి.మునుపటి సంతలు లేవు తిరిగి అమ్మేవారేలేరు.పల్లెల్లో కూడా ఇప్పుడు కూరగాయల దుకాణాలు వెలిశాయి.ఇప్పుడు నా పల్లె పల్లెలా ఉండలేకాపట్నంలా మారలేకా సహజత్వం కోల్పోయి రెంటచెడ్డరేవడయ్యిందిరియల్టర్ల కన్నుసోకి పల్లె రహదారుల వెంట ఉన్న పంటభూములు అధికధర ఆశ చూపితే కన్నతల్లి లాంటి నేలతల్లినమ్ముకొనిపట్నపు ఇంటినిర్మాణాలు చేపట్టిసుఖమయ జీవనం గడుపుతున్నంఅని మురిసే అల్పసంతోషులు.ఎండమావులెంట పరిగెత్తిన అమాయక రైతులుమాయికుడి చేతిలో కన్నతల్లి లాంటి భూతల్లిని పెట్టిన కసాయోడనేననివెక్కివెక్కి ఏడుస్తున్నారు రైతన్నలు
పల్లెలు దేశ ప్రగతికి పట్టుగొమ్మలు :- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి