పుస్తకం హస్తభూషణం:- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
అనుభవజ్ఞుల 
అనుభవసారమై

అజ్ఞానంబాపిన 
దీపమై

హస్తకభూషణమై
మస్తకవికాసమై

భావి జీవితమై

బ్రతుకు సేద్యానికి
ఆధారభూతమై

అచేనత్వంనుండి
చేతనత్వానికి
చీకటి నుండి
 వెలుగులోకి
మూఢత్వం నుండి
హేతువాదం వైపు అడుగులు
వేసేలా చేసిన
పుస్తకం

సకల మనోవికారాలను
పటాపంచలు చేసి
గురువై ,
దైవమై
స్నేహితుడై
తప్పొప్పులు సరిదిద్దే
మార్గదర్శైనది

పుస్తకాన్ని 
తలవంచి చదివాను

ఆ పుస్తకం నేడు
నన్నుతల ఎత్తుకొనేలా చేసింది

నా ఆత్మగౌరవబావుటా పుస్తకం
నా ఆత్మకథలో పుస్తకానిదే
శిఖరాగ్రము

పుస్తకాలను చదవండి
మస్తకాలను జ్ఞానంతో నింపండి
పుస్తకమేవ జయతే
పుస్తకాలు చదవండి చదివించండి
పుస్తకాలను  అన్ని విశేషమైన రోజుల్లో  బహుమతి గా ఇవ్వండి
( 37వ జాతీయ పుస్తక మహోత్సవం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సందర్భంగా వ్రాసిన కవిత)


కామెంట్‌లు