పరిష్కారం ఉండును:- -గద్వాల సోమన్న,-9966414580
సమస్యలే లేని వారు
సృష్టిలో కాన రారు
గుండెలోని  ధైర్యమే!
చూపిస్తే విజయమే!

ప్రతి సమస్యకు ఉంటుంది
ఏదో ఒక పరిష్కారము
మెదడుకు పదును పెడితే
జవాబు దొరుకుతుంది

సమస్యలకు భయపడితే
ఆవరించు పిరికితనము
భవిష్యత్తు జీవితము
అగునోయ్! అంధకారము

ఎంతటివారైనా ఇల
సమస్యలు వెంటాడును
సరిగ్గా యోచిస్తే
తగిన ఉపాయముండును

ఎదుర్కొనాలి సమస్యను
ఆత్మవిశ్వాసంతో
దాన్ని పరిష్కరించుకొని
బ్రతకాలి సాహసంతో


కామెంట్‌లు